శ్రీశైల దేవస్థానం ఆదాయానికి గండి

Published: Saturday December 26, 2020

శ్రీశైలం ఆలయ ఆదాయంపై రాజకీయ నేతల పెత్తనం పెరిగిపోయింది. భక్తుల వాహన పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాలు చేసి రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. à°ˆ వ్యవహారం మొత్తం స్థానిక ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న విమర్శలున్నాయి. రాజకీయ శక్తులుగా ఎదిగిన కొందరు à°ˆ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలంగాణలోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తాజాగా ఆరోపణలు చేశారు. దీంతో శ్రీశైలం ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దేవస్థానం ఆదాయం దృష్ట్యా దశాబ్దాలుగా శాశ్వత షాపులను నిర్వహిస్తున్నారు. ఒక్కో షాపునకు లక్షల్లో అడ్వాన్సులు, వేలల్లో అద్దెలు వస్తుంటాయి. ఇవిగాక దేవస్థానం ఆధ్వర్యంలో లలితాంబిక షాపింగ్‌ కాంప్లెక్సులో 170 పైగా దుకాణాలను గతంలో నిర్మించారు. ఒక్కో షాపునకు రూ.లక్ష అడ్వాన్సు, సుమారు రూ.30వేల దాకా అద్దె చొప్పున అప్పట్లో వేలం వేశారు. సిద్దరామప్ప కాంప్లెక్సులోనూ 60 షాపుల దాకా ఖాళీగా ఉన్నాయి. à°ˆ వేలాల్లో కుంభకోణాలు జరిగాయని, వాటిని తమకే కేటాయించాలని కొందరు తాత్కాలిక దుకాణ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడంతో షాపుల వేలాలు నిలిచిపోయాయి.

 

శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న శాశ్వత దుకాణాల ద్వారా నెలకు రూ.20లక్షల ఆదాయం వస్తుండగా, తాత్కాలిక దుకాణాల ద్వారా వచ్చేది ఎంతో దేవాలయ సిబ్బందే చెప్పలేకపోతున్నారు. పైగా à°† షాపులకు నెలకు రూ.3వేలు కూడా చెల్లించడం లేదు. కాగా, వేలం పూర్తయి నూతన దుకాణాలు అందుబాటులోకి వస్తే దేవస్థానానికి నెలకు రూ.40 లక్షలు చొప్పున ఏడాదికి సుమారు రూ.4.80 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

 

అధికార పార్టీ నేతలు కొందరు దేవస్థానం అధికారులు, సిబ్బందిని మచ్చిక చేసుకొని తోపుడు బండ్లకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. తర్వాత 2-3 నెలల్లోనే అవి తాత్కాలిక దుకాణాలుగా మారుతున్నాయి. ఎవరి వాటాలు వారికి అందుతుండటంతో అధికారులు సైతం కిమ్మనడం లేదు. దేవస్థానం పరిధిలో 400 వరకూ శాశ్వత దుకాణాలు ఉండగా.. 550à°•à°¿ పైగా తాత్కాలిక దుకాణాలు శ్రీశైలం, హఠకేశ్వరం, సాక్షి గణపతి, శిఖరం తదితర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి.  à°ˆ మొత్తం దుకాణాలను వైసీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి అండదండలతో నిర్వహిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అన్యమతస్థుడైన ఆయన ఒకదశలో ప్రస్తుత ఈవోను బదిలీ చేయించడానికి  పావులు కదిపాడు.  ఇప్పుడీ అనుచరుడి తీరుపైనే ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌ అయ్యారు.

భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటుచేసిన రూ.కోట్ల విలువైన పార్కింగ్‌ స్థలాల్లో సదరు అనుచరుడి కనుసన్నల్లో ఏడాదిన్నరలో 40 వరకూ తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. నంది సర్కిల్‌, అన్నపూర్ణ సత్రం, à°—à°‚à°—à°¾ సదన్‌, టెంపుల్‌ హాస్పిటల్‌, అన్నదానశాలకు సమీపంలోని పార్కింగ్‌ స్థలాల్లో ఏకంగా 25కు పైగా దుకాణాలు ఏర్పడ్డాయి. దీంతో సత్రాలకు వచ్చే భక్తులు వాహనాలను పార్కింగ్‌ చేసే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్‌పాత్‌లపై అయితే à°† దుకాణాలకు లెక్కేలేవు. అవన్నీ à°† అనుచరుడి ఆధ్వర్యంలో నడుస్తుండగా అడ్వాన్స్‌ చెల్లించకుండా నిర్వహించుకునేలా à°† అనుచరుడే ప్రోత్సహిస్తున్నాడు. దేవస్థానానికి సంబంధించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలోనూ కీలకంగా మారాడు. కాటేజ్‌లు, సత్రాల్లో కాంట్రాక్ట్‌à°² నిర్వహణలతో పాటు కొందరు కాంట్రాక్టర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులున్నాయి.  శ్రీశైలంలో à°“ మొబైల్‌ క్యాంటీన్‌కు కాలపరిమితి నిండి ఏడాది దాటుతున్నా.. రెన్యువల్‌ చేయించకుండా à°† అనుచరుడి అండదండలతో యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.  అధికారులు కూడా ప్రశ్నించే సాహసం చేయడం లేదు.