ప్రజలంతా స్థానికంగా తయారైన వస్తువులను వాడుకోవాలని ప్రధాన మోదీ పిలుపు

Published: Sunday December 27, 2020

ప్రజలంతా స్థానికంగా తయారైన వస్తువులను నిత్య జీవితంలో వాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్థానిక, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి నెలా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే రేడియో కార్యక్రమం ‘మన్ à°•à±€ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడుతూ, విశాఖ పట్నం నగరవాసి వేంకట మురళీ ప్రసాద్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. 

 

వేంకట మురళీ ప్రసాద్ తన ఇంట్లో ప్రతి రోజూ ఉపయోగించే వస్తువుల జాబితాను తయారు చేశారని, 2021లో సాధ్యమైనంత వరకు భారత దేశంలో తయారైనవాటినే ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారని మోదీ తెలిపారు. à°ˆ సందర్భంగా మురళీ తయారు చేసిన వస్తువుల జాబితాను ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

 

వేంకట మురళీ ప్రసాద్ ‘ఏబీసీ 2021’ శీర్షికతో à°ˆ చార్ట్‌ను తయారు చేశారు. ‘ఆత్మ నిర్భర్ ఘర్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్’ అంటూ 6 కేటగిరీలలో వస్తువుల పేర్లను పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫ్ కేర్, బట్టలు, ఆఫీస్ అండ్ వర్క్, కిచెన్, ఇతర ఐటమ్స్ విభాగాల్లో రోజూ ఉపయోగించే వస్తువులు, యంత్రాలను పేర్కొన్నారు. 

 

ఏసీ, టీవీ, ఫోన్, ఫ్రిజ్, టూత్ బ్రష్, టూత్ పౌడర్, సబ్బు, షాంపూ, ఫేస్ మాస్క్, బట్టలు, సైకిలు, బైక్ వంటివాటిని పేర్కొంటూ, సాధ్యమైనంత వరకు వీటిలో ఎక్కువ వస్తువులను మన దేశంలో తయారైనవాటినే ఉపయోగిస్తానని పేర్కొన్నారు.