20 సెకెన్లు..10 కోట్ల డిగ్రీల వేడి

Published: Tuesday December 29, 2020

న్యూక్లియర్ ఫ్యూజన్.. అణు కేంద్రకాలు ఒకదానిలో మరొకటి లీనమయ్యే ప్రక్రియ. దీని ద్వారా అనంతమైన శక్తి.. వేడి, వెలుతురు రూపంలో విడుదల అవుతాయి. సూర్యుడిలో జరిగేది ఇదే. à°…యితే..దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు భూమ్మీదే కేస్టార్(KSTAR) à°“ కృత్రిమ స్యూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. కృత్రిమ సూర్యుడు అనేది వాస్తవానికి à°“ యంత్రం. దీని ద్వారా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి, ఏకంగా 20 సెకెన్లు పాటు 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగేలా చేశారు. 

సూర్యుడిలోని ఉష్ణోగ్రతలే 1.5 కోట్ల డిగ్రీలకు పరిమితమవుతున్న నేపథ్యంలో à°ˆ ప్రయోగం ఎంతటి విశిష్టమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. à°ˆ స్థాయి ఉష్ణోగ్రతలు..20 సెకెన్ల పాటు కొనసాగేలా చేయడం ఇదే ప్రథమం కావడంతో à°ˆ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు à°“ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా à°ˆ ప్రయోగం చేపట్టారు. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ à°ˆ ప్రయోగానికి వేదిక అయింది. 

 

పర్యావరణహిత ఇంధనాల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం..న్యూక్లియర్ ఫిజన్(అణు విచ్ఛేదనం) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మానవ అవసరాల కోసం న్యూక్లియర్ ఫ్యూజన్‌ను పారిశ్రామిక స్థాయిలో వినియోగించుకోవడం ఇప్పటివరకూ సాధ్యపడలేదు.