రామతీర్థం బోడికొండ ఆలయంలో దుండగుల దుశ్చర్య

Published: Wednesday December 30, 2020

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న బోడికొండపై కోదండ రామాలయం ఉంది. మంగళవారం ఉదయం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వారు నెల్లిమర్ల పోలీసులకు తెలిపారు. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే తల భాగం కోసం పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరకలేదు. పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌ టీమ్‌ ప్రతినిధులు ఆధారాల సేకరణ ప్రారంభించారు.

 

విషయం తెలిసిన వెంటనే ఎస్‌పీ రాజకుమారి హుటాహుటిన బోడికొండకు చేరుకుని.. డీఎ్‌సపీ అనిల్‌ కుమార్‌తో కలిసి ఆలయ లోపలి భాగాన్ని పరిశీలించారు. దేవస్థానం సిబ్బందితో మాట్లాడారు. దర్యాప్తునకు ప్రత్యేక పోలీస్‌ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా à°ˆ దుశ్చర్యపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శివానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. à°—à°¤ రెండేళ్లలో రాష్ట్రంలో 20 దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ ఇంతవరకూ ఒక్కరిపై కూడా చర్యల్లేవని ఆరోపించారు. రామతీర్థం ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఆలయం లోపలకు అనుమతించక పోవడంతో వణికించే చలిలోనే పార్టీ నేతలతో కలిసి ఆమె నిరసన తెలియజేస్తున్నారు. కోదండరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టనుంది.

 

పార్టీ కార్యాలయం నుంచి ఆలయం వరకు మౌన ప్రదర్శన నిర్వహిస్తామని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు తెలిపారు. కాగా, à°ˆ ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్‌ అయ్యారు. జిల్లా ఎస్పీతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. à°ˆ ఘటనపై విచారణ వేగవంతం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. à°ˆ ఘటనపై ఆర్‌జేసీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించాలని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ను ఆదేశించగా, మల్టీ జోన్‌ ఆర్జేసీ à°¡à°¿.భ్రమరాంబను నియమించారు.