సహాయ పునరావాసం పూర్తిపైనే దృష్టి

Published: Friday January 01, 2021

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణలపై నోరుమెదపని కేంద్రం.. పనులు సాగుతున్న తీరుపై తాజాగా నిఘా పెట్టింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పీపీఏ అధికారులు ఇటీవలి కాలంలో తరచూ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి పనులు పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్‌, కాంట్రాక్టు సంస్థల అధికారులతో సమీక్షలు జరుపుతూ.. లోటుపాట్లు ఉంటే తగిన సూచనలు చేస్తున్నారు. మరో ఆరు నెలల వరకూ అంటే.. జూన్‌ నెలాఖరు దాకా నిరాటంకంగా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. జూలై నుంచి వరదలు మొదలవుతాయి. నవంబరు నెలాఖరుదాకా పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. à°ˆ నేపథ్యంలో వచ్చే జూన్‌లోపు పనుల వేగం పెరిగేలా కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), పీపీఏ బృందాలు వరుసగా ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. తమకు వాస్తవ సమాచారం అందించే సాంకేతిక నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. పోలవరం రేడియల్‌ గేట్ల తయారీలో కీలకపాత్రను పోషించిన సీనియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులతో కేంద్ర జల సంఘం నేరుగా చర్చించి.. పర్యవేక్షణకు పురమాయించింది. రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండానే à°ˆ నిర్ణయం తీసుకున్న జల సంఘం.. ప్రాజెక్టు పర్యవేక్షణాధికారులకు కూడా సీనియర్‌ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించింది. హెడ్‌ వర్క్స్‌ పూర్తిపై కాలపరిమితి విధించింది.

 

కేంద్రం రీయింబర్స్‌ చేసే నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని జల వనరుల శాఖను ఆదేశించింది. డిసెంబరు మొదటివారంలో పోలవరం ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం ప్రత్యేక ఖాతాను తెరచినప్పటికీ.. అందులో కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులను జమచేయలేదు. à°ˆ పరిణామంపై కేంద్రం కన్నేసింది. ఇంకోవైపు.. వచ్చే ఏడాది డిసెంబరులోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని జలశక్తి శాఖ గడువు విధించింది. గేట్ల బిగింపు నుంచి భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపైనా లక్ష్యాన్ని నిర్దేశించింది. నెలకు 8 గేట్ల చొప్పున బిగిస్తూ.. మే నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఇదే సమయంలో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఉద్దేశం వేరుగా ఉన్నట్లు వార్తలు వస్తుండడం, దీనికితోడు భూసేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించిన ప్రణాళికలను పీపీఏకి ఇవ్వపోవడంతో.. బుధవారం విజయవాడలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ జలవనరుల శాఖతో సమావేశం నిర్వహించారు. పునరావాస కాలనీలను పూర్తిచేసి.. నిర్వాసితులను తరలించడం పూర్తిచేస్తే తప్ప కాఫర్‌ డ్యాం పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పడం ద్వారా ఒత్తిడి పెంచారు. 32 మీటర్ల కాంటూరు వరకూ భూసేకరణ పూర్తయినందున.. యుద్ధ ప్రాతిపాదికన సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని.. à°† తర్వాతే కాఫర్‌ డ్యాం గ్యాప్‌ను పూర్తి చేసేందుకు అవకాశమిస్తామని తేల్చిచెప్పారు.