కరోనా వైరస్‌ను అంతమొందించే టీకా

Published: Saturday January 02, 2021

కరోనా వైరస్‌ను అంతమొందించే టీకా త్వరలోనే దేశంలో అందుబాటులోకి రానున్నట్టు వార్తలు వస్తున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాణాంతక వైరస్‌పై పోరులో ముందున్న మూడు కోట్ల మందికి తొలి విడతలో వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. వీరిలో కోటిమంది ఆరోగ్య కార్యకర్తలు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నారు. టీకా విషయంలో ప్రభుత్వ తొలి ప్రాధాన్యం వీరికేనని స్పష్టం చేశారు. ప్రాధాన్య క్రమంలో ఉన్న మిగతా 27 కోట్ల మంది వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తున్నట్టు చెప్పారు. పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్‌’ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ నియమిత నిపుణుల కమిటీ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ం ఇండియా (డీసీజీఐ)à°•à°¿ ప్రతిపాదించింది.  

 

 

నిపుణుల కమిటీ ప్రతిపాదనపై డీసీజీఐ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి పుకార్లు ఉండకూడదని, ప్రతీది క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పోలియో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లోనూ పుకార్లు షికారు చేశాయని, అయితే అది ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు దానిపై విశ్వాసం ఉంచారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు డ్రై రన్ నిర్వహిస్తున్నాయని, దీనివల్ల ఏవైనా లోపాలు ఉంటే తెలుస్తాయని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అవి జరగకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. కాగా, à°ˆ వారంలో అసోం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌లలో రెండు రోజులపాటు డ్రైరన్ నిర్వహించారు.