కోవిడ్ వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితం

Published: Sunday January 03, 2021

ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత దేశం సిద్ధమవుతున్న తరుణంలో వ్యాక్సిన్లపై ప్రచారమవుతున్న వదంతులను డీసీజీఐ (డగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) తోసిపుచ్చారు. కోవిడ్-19 వ్యాక్సిన్లను వేసుకుంటే నపుంసకత్వం సంభవిస్తుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అర్థరహితమని తెలిపారు. 

 

డీసీజీఐ వీజీ సోమని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భద్రత పరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం తెలపబోమని చెప్పారు. కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితమైనవని స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్‌కైనా స్వల్ప జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణ విషయమేనని చెప్పారు. వ్యాక్సినేషన్ వల్ల నపుంసకత్వం వస్తుందని జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అర్థరహితమని చెప్పారు. à°ˆ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు. 

 

తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించాలని సీడీఎస్‌సీవో (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నిర్ణయించిందన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించినట్లు తెలిపారు. క్యాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 

 

ఇదిలావుండగా, కోవిడ్ వ్యాక్సిన్లపై వదంతుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలను డిసెంబరు 31à°¨ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరిన సంగతి తెలిసిందే. సందేశాలను సరిచూసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని కోరారు. మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో భారత దేశం కోవిడ్ రహితం కాబోతోందని, రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. 

 

మరోవైపు  భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను పక్కనబెట్టి కోవాగ్జిన్‌ అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు