స్వదేశీ వ్యాక్సిన్లు వచ్చేశాయ్

Published: Sunday January 03, 2021

 à°­à°¾à°°à°¤ దేశం కోవిడ్ రహితం కాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్‌ను అభినందిస్తూ, భారతీయులందరికీ అభినందనలు తెలిపారు. స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయాత్మక మలుపుగా à°ˆ పరిణామాలను అభివర్ణించారు. సీరమ్ ఇండియా, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని, దీంతో ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని వరుస ట్వీట్లలో ఆదివారం తెలిపారు.

 

అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన à°ˆ రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం ప్రతి భారతీయునికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. దీనినిబట్టి స్వయం సమృద్ధ భారత దేశం కోసం కంటున్నకలలను నిజం చేయడానికి మన శాస్త్రవేత్తలు à°Žà°‚à°¤ ఆత్రుతపడుతున్నారో తెలుస్తోందని తెలిపారు. స్వయం సమృద్ధ భారత్‌ మూలాలు దయతో వ్యవహరించడం, అందరినీ సంరక్షించడం అని పేర్కొన్నారు. 

 

అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం అసాధారణంగా కృషి చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా యోధులకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. అనేక మంది జీవితాలను కాపాడినందుకు ఎన్నటికీ వారికి కృతజ్ఞతాబద్ధంగా ఉంటామన్నారు. 

 

సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం లభించింది. వీటి పరిమిత వినియోగానికి అనుమతించినట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమని తెలిపారు.