ఏ జట్టుపై బెట్టింగ్ పెట్టాలి?

Published: Tuesday January 05, 2021

వివాదాలకు కేంద్ర బిందువైన ఐపీఎల్‌లో మరోమారు బెట్టింగ్ కలకలం రేగింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో బెట్టింగ్‌కు సంబంధించి జరిగిన ప్రయత్నం à°’à°•à°Ÿà°¿ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని à°“ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న à°“ నర్సు à°“ క్రికెటర్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి మరీ వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్న విషయం బయటకు వచ్చి కలకలం రేపుతోంది. బెట్టింగ్ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై పెడితే బాగుంటుంది? అన్న వివరాలను ఆమె అడిగింది. 

 

‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’  కథనం ప్రకారం..సెప్టెంబరు 30à°¨ à°ˆ ఘటన జరిగింది. à°† ఆటగాడు à°ˆ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాని(ఏసీయూ)à°•à°¿ చేరవేశాడు. దర్యాప్తు తర్వాత à°ˆ విషయం ముగిసింది. భారత జట్టుకు రెండేళ్లుగా à°† క్రికెటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు సమాచారం. 

బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ à°ˆ విషయమై స్పందిస్తూ.. బెట్టింగ్ గురించి à°“ మహిళ తనను à°…à°¡à°¿à°—à°¿ విషయాన్ని à°† క్రికెటర్ తమకు చెప్పాడని, దర్యాప్తు అనంతరం à°ˆ కేసు ముగిసిందని అన్నారు. అవగాహన లేకే ఆమె ఇలా ప్రవర్తించిందని పేర్కొన్నారు. ఆటగాడిని సంప్రదించిన మహిళకు బెట్టింగ్ సిండికేట్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తేలిందన్నారు. 

 

‘‘à°ˆ ఘటనపై దర్యాప్తు నిర్వహించాం. బెట్టింగు కోసం సంప్రదించిన మహిళకు à°† క్రికెటర్‌ తెలుసు. ఆటగాడు à°† విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దర్యాప్తు చేశాం. ప్రశ్నించేందుకు ఆమెను కూడా పిలిపించాం. ఆమెకు బెట్టింగ్ ముఠాలతో సంబంధం లేదని తేలింది. దీంతో à°† విషయాన్ని అక్కడితో ముగించాం’’ అని అజిత్ సింగ్ వివరించారు.