అమెరికాలో హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం

Published: Thursday January 07, 2021

అమెరికాలో హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింస నేపథ్యంలో నలుగురు మరణించారు, à°ˆ తరుణంలో మోదీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. 

 

‘‘వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింస గురించి వార్తలు చూడటం ఆవేదన కలిగించింది. పద్ధతి ప్రకారం, శాంతియుత అధికార బదిలీ కొనసాగాలి. చట్ట వ్యతిరేక నిరసనల ద్వారా ప్రజాస్వామిక ప్రక్రియ పక్కదోవపట్టడానికి అనుమతించరాదు’’ అని మోదీ పేర్కొన్నారు. 

 

యూఎస్ కేపిటల్‌వైపు అనూహ్యంగా కొందరు దూసుకురావడంతో పెద్ద ఎత్తున హింస జరిగింది. అనేక మంది గాయపడగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో ఉన్న అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నేతలు ఖండించారు. 

ఇదిలావుండగా, అమెరికా తదుపరి అద్యక్షుడు జో బైడెన్ అని అమెరికన్ కాంగ్రెస్ ధ్రువీకరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు అధికార బదిలీకి తాను పూర్తిగా సహకరిస్తానని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.