అఖిలప్రియ కేసులో ట్విస్ట్

Published: Thursday January 07, 2021

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హఠాత్తుగా ఏ1à°—à°¾ పేర్కొన్నారు. à°ˆ మేరకు రిమాండ్‌ రిపోర్ట్‌ రిలీజ్ చేశారు. ఏ1à°—à°¾ ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2à°—à°¾ పేర్కొన్నారు. ఇక ఏ3à°—à°¾ భార్గవ్ రామ్‌ను చేర్చారు. వీరితో పాటు శ్రీనివాసరావు, సాయి, à°šà°‚à°Ÿà°¿, ప్రకాష్‌ పేర్లను కూడా à°ˆ కేసులో చేర్చారు. హఫీజ్‌పేటలో సర్వేనెం.80లో 2016లో బాధితులు 25 ఎకరాలు కొన్నారని, భూమి తమదేనని అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్‌ వాదిస్తున్నారని బోయిన్ పల్లి పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్‌ చేసుకున్నారని, అయితే భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారన్నారు.

నిన్నటి వరకు ఏ2à°—à°¾ ఉన్న అఖిలప్రియను నేడు ఏ1à°—à°¾ చేర్చిన పోలీసులు ఆమెపై మరో రెండు సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసులు నమోదు చేశారు. నూతనంగా ఐపీసీ సెక్షన్ 147, 385 లను అదనంగా చేర్చి కేసులు మోపారు. ఇక అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కోసం గాలింపు చేపట్టారు. భార్గవ్‌రామ్‌‌ను వెతికి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు బెంగళూరుకు వెళ్లాయి.

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. నిన్న ఏ2à°—à°¾ ఉన్న అఖిలప్రియను నేడు ఏ1à°—à°¾ మార్చారని, అంతేకాకుండా ప్రజాప్రతినిధిగా ఉన్న అఖిలప్రియకు 41 సీఆర్పీసీ నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సికింద్రాబాద్ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది