విగ్రహాల ధ్వంసంలో దొరకని దోషులు

Published: Thursday January 07, 2021

దేశంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడుతూ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ సొంతం! à°ˆ విషయాన్ని à°† శాఖ పెద్దలు పదేపదే ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటారు. à°…à°‚à°¤ గొప్ప టెక్నాలజీ, సామర్థ్యం ఉన్న పోలీసులు ఆలయాలపై దాడులు చేసిన వారిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. à°ˆ కేసుల విషయంలో ‘కనిపించని నాలుగో సింహం’పై పైకి కనిపించని ఏవో ఒత్తిళ్లు పని చేస్తున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా విగ్రహాల విధ్వంసం ఆగకపోవడానికి... పోలీసుల అసమర్థత కారణం కాదని, à°ˆ విషయంలో వారు ‘నిస్సహాయులుగా మారడమే’ కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

శ్రీశైలం మఠంలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు సంబంధించిన కేసులో పోలీసులు à°’à°• అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సిన వ్యక్తి! ‘‘శివలింగం పెకలించిన ఘటనలో అతను ఉంటే రాజీనామా చేస్తా’’ అని అధికార పార్టీ నేత సవాల్‌ విసిరారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసు నుంచి à°† వ్యక్తిని తప్పించారు. దీంతో... శివాలయంలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న à°† అన్యమత నేత వీడియోను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. అయినా... పోలీసులు గప్‌చుప్‌! పైగా... వీడియో విడుదల చేసిన బీజేపీ నేతనే పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. 

 

కర్నూలు జిల్లాలోనే ఇటీవల కోసిగా సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాల పెచ్చులూడి కిందపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని కొట్టేశారని, హుండీ కూడా చోరీ చేసే ప్రయత్నం జరిగిందని స్వయంగా పూజారే తెలిపారు. విచిత్రమేమిటంటే... పోలీసులు పూజారిని, ఆలయ ధర్మకర్తతోపాటు à°ˆ విషయాన్ని వాట్స్‌పలో షేర్‌ చేసిన ‘ఆంధ్రజ్యోతి’తోపాటు à°’à°• చానల్‌ విలేకరిని అర్ధరాత్రి దాకా నిర్బంధించి, à°† తర్వాత వాళ్లపై కేసు పెట్టారు. ఒకవేళ విగ్రహాలు వాటంతట అవే దెబ్బతిని ఉంటే అదే విషయం చెప్పాలి. పూజారిపైనా, విలేకరులపైనా కేసు పెట్టడమెందుకని ఆరా తీస్తే... స్థానిక ప్రజా ప్రతినిధి ‘ఆదేశాలే’ దీనికి కారణమని తెలిసింది.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. దొంగలు అర్ధరాత్రి ఎత్తుకుపోయి ఉండొచ్చుకానీ... జరిగిన ప్రాంతం మాత్రం ఏ మారుమూలనో లేదు. విషయం బయటికి రాగానే.. ‘లాక్‌డౌన్‌కు ముందే, తెలుగుదేశం హయాంలోనే విగ్రహాలు పోయాయ్‌’ అని అధికార పార్టీ నేతలు తేల్చేశారు. à°† తర్వాత... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెండి రథానికి సింహాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. రామతీర్థం ఘటనలో ‘తీవ్రంగా స్పందించిన’ ప్రభుత్వం ఆలయ ధర్మకర్త పదవి నుంచి టీడీపీ   à°¸à±€à°¨à°¿à°¯à°°à±‌ నేతను అప్పటికప్పుడు తప్పించేసింది. కానీ, దుర్గమ్మ వెండి రథాల చోరీపై ఇలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇక పోలీసుల విషయానికొస్తే... గతంలో ఇదే విజయవాడలో కిలోల కొద్ది బంగారం పోయినప్పుడు, 8 రాష్ట్రాల్లోని దొంగలను ఇట్టే పట్టేశారు. ఇప్పుడు దుర్గమ్మ ఆలయ à°°à°¥ వెండి సింహాల చోరీ కేసులో దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.