భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు..

Published: Saturday January 09, 2021

‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రోత్సహిస్తున్న భారత్‌కు ఫ్రాన్స్‌ భారీ ఆఫర్ ఇచ్చింది. రఫేల్ విమానాల ఉత్పత్తిలో భాగంగా..వీటి అసెంబ్లీలైన్‌లో 70 శాతాన్ని భారత్‌కు తరలించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఫ్రాన్స్ తాజాగా పేర్కొంది. అంతే కాకుండా.. ఫాంథర్ హెలికాఫ్టర్‌à°² అసెంబ్లీని(విడిభాగాలను పేర్చి హెలికాఫ్టర్‌ను సిద్ధం చేయడం) కూడా పూర్తి స్థాయిలో భారత్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. 

 

 

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వ్యూహాత్మక చర్చల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఎమాన్యుయెల్ బాన్ భారత్‌ అధికారుల వద్ద à°ˆ విషయాన్ని ప్రస్తావించారు. à°ˆ ప్రణాళిక సాకారమైతే..రఫేల్ ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు..నేవీ కోసం మీడియం యూటిలిటీ హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. à°ˆ నేపథ్యంలో ఫాంథర్ అసెంబ్లీ లైన్ తరలింపు కూడా భారత్‌కు లాభిస్తుందని వారు అంటున్నారు. భారత్ ఇప్పటికే 36 రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని రఫేళ్లను కూడా కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది.