ఏపీలో కొత్తగా 26 జిల్లాలు..?

Published: Sunday January 10, 2021

 à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం జిల్లాల ఏర్పాటుకు సూచించినట్లు తెలిసింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులకు సూచించినట్లు సమాచారం. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, 3 డివిజన్ల రద్దుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ à°—à°¡à°¿à°šà°¿à°¨ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వైసీపీ చెప్పింది.

 

 

పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ à°—à°¤ నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్‌ నుంచి పైస్థాయి అధికారి వరకూ ఏ ఒక్కరినీ బదిలీ చేయవద్దని సవాంగ్ స్పష్టంగా నిర్దేశించారు. జనరల్‌ రైల్వే పోలీస్‌, సీఐడీ, ఇంటెలిజెన్స్‌, ఏపీఎస్పీతోపాటు శాంతిభద్రతల విభాగాలైన రేంజ్‌లు, ఎస్పీల పరిధిలో తక్షణమే à°ˆ నిర్ణయం అమల్లోకి వస్తుందని à°† సందర్భంలో చెప్పారు.