వ్యాక్సిన్‌పై ప్రధాని మోదీ వార్నింగ్

Published: Monday January 11, 2021

 à°•à°°à±‹à°¨à°¾ వ్యాక్సిన్ ముందుగా పొందేందుకు క్యూ కట్టవద్దని రాజకీయ నేతలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్న సందర్భంగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకునేందుకు తమ వంతు వచ్చేంత వరకూ రాజకీయ నేతలు వేచి ఉండాలని సూచించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా తొలి దశలో వ్యాక్సిన్ తీసుకునే జాబితాలో చేర్చాలని హర్యానా ప్రభుత్వం కేంద్ర వైద్యఆరోగ్య శాఖను కోరిన సందర్భంలో ప్రధాని ఇలా స్పందించారు. కోటి మంది హెల్త్ వర్కర్లకు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఉచితంగా టీకాను ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం ఇప్పటికే వారి జాబితాను సిద్ధం చేసింది.