వ్యాక్సినేషన్‌కు పక్కాగా ఏర్పాట్లు

Published: Friday January 15, 2021

జిల్లాకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. 46,500 డోసుల వ్యాక్సిన్‌తో ప్రత్యేక వాహనం విజయవాడ నుంచి బుధవారం ఉదయం నగరానికి చేరింది. à°ˆ వ్యాక్సిన్‌ను పెదవాల్తేరులోని ఇమ్యునైజేషన్‌ కార్యాలయంలో సిద్ధం చేసిన భారీ వాకిన్‌ కూలర్‌లో భద్రపరచారు. సీరం ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ను జిల్లాకు కేటాయించారు. ఇమ్యునైజేషన్‌ కేంద్ర కార్యాలయానికి చేరిన వ్యాక్సిన్‌ను కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌తోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. మొదటి దశలో భాగంగా à°ˆ నెల 16 నుంచి ఎంపిక చేసిన 32 కేంద్రాల్లో 36,694 మంది ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. త్వరలో మరో 190 కేంద్రాలను ఎంపిక చేసి, మొత్తం 222 చోట్ల వ్యాక్సిన్‌  ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నగరంలోని కేంద్ర స్టోరేజీలో వున్న వ్యాక్సిన్‌ను ఈనెల 15à°¨ రిఫ్రిజిరేటెడ్‌ వ్యాన్లలో   à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°— కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వ్యాక్సిన్‌ భద్రపరుస్తారు. 16à°µ తేదీ ఉదయం ఐసోలేటెడ్‌ రిఫ్రిజిరేటర్లు (ఐఎల్‌ఆర్‌) ద్వారా వ్యాక్సిన్‌ కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ డీప్‌ ఫ్రిజ్‌లో భద్రపరచనున్నారు. ప్రతిరోజూ ఎంతమందికి వ్యాక్సిన్‌ను అందిస్తారో, అంతమందికి మాత్రమే వయుల్స్‌ను పంపిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. 

ముందుగానే సమాచారం.. 

వ్యాక్సిన్‌ తీసుకునే ఆరోగ్య సిబ్బందికి ముందురోజే వారి ఫోన్‌ నంబర్‌కు సమాచారం వెళుతుంది. à°† మెసేజ్‌ చూపిస్తేనే వ్యాక్సినేషన్‌ తీసుకునే కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది...టీకా తీసుకునే వ్యక్తి వివరాలను నమోదు చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డిజిటల్‌ అసిస్టెంట్‌), మహిళా పోలీస్‌, ఆశ వర్కర్‌, అంగన్వాడీ కార్యకర్త, వ్యాక్సినేటర్‌ (డాక్టర్‌, ఏఎన్‌à°Žà°‚, స్టాఫ్‌ నర్సు ఎవరైనా కావచ్చు) ఉంటారు. ప్రతి వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద అంబులెన్స్‌, ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రాథమిక వైద్యం అందించేందుకు మందులతో కూడిన ఏఈఎఫ్‌ఐ కిట్‌  ఉంచుతారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే వారికి వైద్యం అందించేందుకు దగ్గర్లోని ఆస్పత్రుల్లో ఐదుగురు వైద్యులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కేజీహెచ్‌, విమ్స్‌, ప్రథమ, నర్సీప ట్నం, అనకాపల్లి, పాడేరు ఆస్పత్రులను ఎంపిక చేశారు.  

ఒక్కొక్కరికీ 0.5 ఎంఎల్‌

ఐదు మిల్లీ లీటర్లు బాటిల్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను నింపారు. ఒక్కో బాటిల్‌ (వయుల్స్‌)లో వుండే వ్యాక్సిన్‌ పది మందికి సరిపోతుంది. ఒక్కొక్కరికీ 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ను మొదటి డోసుగా అందిస్తారు.

 

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): à°ˆ నెల 16 నుంచి జిల్లాలో ప్రారంభించే కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లా డుతూ ప్రతి మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌ఐలతో కొవిడ్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, à°† కమిటీలు అవసరమైన సిబ్బందిని నియమించుకుని పకడ్బందీగా కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ సౌకర్యం వుండాలని సూచించారు. à°ˆ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.