పాకిస్థాన్‌లో మోదీ ప్లకార్డులతో భారీ ర్యాలీ

Published: Monday January 18, 2021

పాకిస్థాన్‌లో సింధు దేశం కోసం జరుగుతున్న స్వాతంత్ర్య అనుకూల ర్యాలీలో భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ సహా ఇతర దేశాధినేతల ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ఆధునిక సింధి జాతీయవాదం వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎం సయ్యద్ 117à°µ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య అనుకూల ర్యాలీని భారీగా నిర్వహించారు. à°ˆ సందర్భంగా మోదీ, ఇతర దేశాధినేతల జోక్యం కోరుతూ వారి ప్లకార్డులు ప్రదర్శించారు. 

 

సయ్యద్ సొంత పట్టణమైన సింధ్ ప్రావిన్స్‌లోని జమ్‌షోరో జిల్లాలోని సాన్‌లో ఆదివారం à°ˆ ర్యాలీ నిర్వహించారు. సింధులోయ నాగరికతకు, వేద మతానికి ఇది పుట్టినిల్లని నినదించారు. బ్రిటిషర్లు దీనిని ఆక్రమించి, 1947లో దుర్మార్గులైన ఇస్లామిస్టుల చేతుల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య అనుకూల నినాదాలు చేశారు. సింధు దేశం కోసం అగ్రదేశాధినేతలు జోక్యం చేసుకోవాలని కోరారు.

 

సింధులో పలు జాతీయవాద పార్టీలు ఉన్నాయి. అవన్నీ సింధు దేశం కోసం పోరాడుతున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా వివిధ అంతర్జాతీయ వేదికలపై గళాన్ని వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ తమను ఆక్రమించిందని, తమ సంపద, వనరులను యథేచ్ఛగా దోచుకుంటోందని, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి.