కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమని వైద్య నిపుణుల స్పష్టీకరణ

Published: Wednesday January 20, 2021

కరోనా వ్యాక్సిన్‌...ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ. అయితే ప్రభుత్వం ఆశించిన మేర వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోలేదు. వ్యాక్సిన్‌పై వున్న అపోహలు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు దీనికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో కొంతమందిలో అనుమానాలు మొదలయ్యాయి. à°ˆ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహల నివృత్తి కోసం   à°µà±ˆà°¦à±à°¯ à°°à°‚à°— నిపుణుల అభిప్రాయాలతో అందిస్తున్న సమగ్ర కథనం.

 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దశలో వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అంతా ఆశగా ఎదురుచూశారు. వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరుకున్న తరువాత..వ్యాక్సిన్‌ తయారీకి à°…à°‚à°¤ సమయం పడుతుందా..? అంటూ నిట్టూర్చారు. à°ˆ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇది అందుబాటులోకి రావడానికి ముందు కనిపించిన ఉత్సుకత, ప్రస్తుతం చాలామందిలో కనిపించడం లేదు. వ్యాక్సిన్‌ తీసుకుని ప్రజలకు మరింత భరోసా కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బందే చాలాచోట్ల వ్యాక్సినేషన్‌కు ముందుకురావడం లేదు. దీంతో జిల్లాలో అధికారులు నిర్దేశించిన మోతాదుకంటే తక్కువ వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.