అర్హులైనవారికి 90 రోజుల్లో పట్టా ఇవ్వడమే లక్ష్యం

Published: Thursday January 21, 2021

ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా à°ˆ కార్యక్రమం కొనసాగాలన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. à°ˆ విధానం సమర్థంగా కొనసాగడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర భూ సర్వే, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాలపై గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. à°ˆ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు

 

పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేవరకు వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు. పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను సర్వేలో భాగంగా తీసుకోవాలని, మ్యాప్‌à°² తయారీలో వీటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. కాలనీల్లో ప్రతి ఇంటికీ యూనిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. సర్వేకు వెళ్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది రోజూ కనీసం 2à°—à°‚à°Ÿà°² పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. అంతకుముందు అధికారులు మాట్లాడుతూ, సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. రెండోస్థాయి పరీక్షల్లో 92శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫిబ్రవరిలో మూడోస్థాయి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.