‘భగవద్గీత పార్టీ కావాలా... బైబిల్ పార్టీ కావాలా

Published: Friday January 22, 2021

తిరుపతి: ‘భగవద్గీత పార్టీ కావాలా... బైబిల్ పార్టీ కావాలా...’ అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. à°† వ్యాఖ్యలు సంజయ్ వ్యక్తిగతమని, తానలా విడగొట్టి మాట్లాడలేనన్నారు. దేవాలయాల దాడుల సందర్భంగా ఏపీ మంత్రుల చేసిన వ్యాఖ్యలతో ఆవేదన చెందిన బండి సంజయ్.. à°† విధంగా మాట్లాడి ఉంటారన్నారు. à°† స్థాయి వ్యక్తి మనసులో అలా ఉంటుందని తాను అనుకోవడం లేదని, అలా ఉండి ఉంటే ప్రపంచం ఇలా ఉండదని పవన్ బదులిచ్చారు. తిరుపతి ఉపఎన్నికలను ఉద్దేశిస్తూ.. బండి సంజయ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భగవద్గీత పార్టీ కావాలో.. బైబిల్ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ ఏపీ ప్రజలకు సంజయ్ పిలుపునిచ్చారు. à°† వ్యాఖ్యలపై పవన్ తాజాగా స్పందించారు.

 

హిందూ మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి ఆపాదించొద్దని, మతం అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదన్నారు. సగటు భారతీయుడిగా.. అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటానన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి... ఏపీ బీజేపీ చేపట్టి యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. దోషులను పట్టుకోవాలన్నది తమ డిమాండ్ అన్నారు. ప్రభుత్వం ఆనాడే పట్టించుకుంటే ఈ గొడవే ఉండేది కాదన్నారు.