ఆర్‌బీఐ మరో విప్లవాత్మక ఆలోచన.

Published: Tuesday January 26, 2021

 à°‡à°¦à°¿ à°¡à°¿à°œà°¿à°Ÿà°²à± కరెన్సీల యుగం. వర్చువల్ నగదు, క్రిప్టో కరెన్సీల పేరిట నగదుకు ప్రత్యామ్నాయ రూపాలెన్నో ప్రజల ముందుకు వచ్చాయి. à°ˆ నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా డిజిటల్ కరెన్సీ అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఫియట్ కరెన్సీకి(నాణేలు, నోట్లు) డిజిటల్ రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కేంద్ర బ్యాంకు పరిశీలిస్తోంది. భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ పేరిట పేరిట ప్రచురించిన అధ్యయనంలో à°ˆ విషయాలను వెల్లడించింది. ‘à°ˆ రకమైన కరెన్సీలు, ఫలితంగా వచ్చే ప్రమాదల కారణంగా భారత ప్రభుత్వ వర్గాలు ఎప్పటినుంచో డిజిటల్ కరెన్సీలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే...ప్రస్తుతమున్న ఫియట్ కరెన్సీని పోలిన డిజిటల్ కరెన్సీ అవసరం దేశంలో ఉందా..? ఇవి అవసరమే అనుకున్న పక్షంలో వీటిని ఎలా చలామణీలోకి తేవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రస్తుతమున్న నగదుకు వలెనె à°ˆ డిజిటల్ కరెన్సీకి కూడా ప్రభుత్వమే పూచిగా నిలుస్తోంది. కాబట్టి..à°ˆ కరెన్సీని సాధారణ నగదు వలెనే వినియోగించుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా చెల్లింపుల వ్యవస్థల్లో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి ఏకంగా నగదుకు ప్రత్యామ్మాయంగా పలువురు భావిస్తున్న క్రిప్టో కరెన్సీ వరకూ అనేక సృజనాత్మక వ్యవస్థలు ఇటీవల కాలంలో ఉనికిలోకి వచ్చాయి.