స్ట్రెయిన్‌కు మన కోవాగ్జిన్‌తో చెక్

Published: Wednesday January 27, 2021

బ్రిటన్‌లో మొదట కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు చికిత్సలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ సత్ఫలితాలు ఇస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో à°ˆ విషయం వెల్లడైందని భారత్ బయోటెక్ à°“ ట్వీట్‌లో తెలిపింది. ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్ట్ నిర్వహించిన ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్‌లో ఇది వెల్లడైనట్లు పేర్కొంది. యూకే వేరియంట్ స్ట్రెయిన్‌కు చికిత్స కోసం కోవాగ్జిన్‌ను స్వీకరించినవారి  నుంచి సేకరించిన సెరా (రసి)ని à°ˆ పరీక్షలో వినియోగించినట్లు తెలిపింది. à°ˆ ట్వీట్‌తోపాటు à°ˆ అధ్యయనం వివరాలను తెలిపే నివేదికను జత చేసింది.

 

ప్రయోగ శాలలో అభివృద్ధిపరిచే కల్చర్డ్ సెల్‌కు ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించే, మట్టుబెట్టే యాంటీబాడీలను కొలిచే పద్ధతిని ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్‌ అంటారు. బయోఆర్ఎక్స్ఐవీ ప్రీ ప్రింట్ వెర్షన్‌లో ప్రచురితమైన డాక్యుమెంట్‌ ప్రకారం, యూకే వేరియంట్‌పైనా, విధర్మ (హెటెరొలోగస్) స్ట్రెయిన్‌పైనా  వ్యాక్సినేషన్ చేయించుకున్నవారి సెరా న్యూట్రలైజేషన్ యాక్టివిటీని పోల్చినపుడు ఒకే విధమైన సామర్థ్యాన్ని చూపించడంతో న్యూట్రలైజేషన్ ఎస్కేప్ అవకాశాలకు సంబంధించిన అనిశ్చితిపై అనుమానాలు నివృత్తి అయ్యాయి. à°ˆ అధ్యయనంపై పీర్ రివ్యూ జరగవలసి ఉంది. 

 

భారత దేశానికి బ్రిటన్ నుంచి వచ్చిన వారి నుంచి ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2ను యూకే-వేరియంట్‌కు చెందిన అన్ని సిగ్నేచర్ మ్యుటేషన్లతో వేరుచేసి, నిర్థరించడంలో విజయం సాధించామని పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త పేర్కొన్నారు. రెండో దశ కోవాగ్జిన్ ట్రయల్స్‌లో à°ˆ వ్యాక్సిన్‌ను తీసుకున్న 38 మంది నుంచి సెరాను సేకరించి పరీక్షించినట్లు à°ˆ వ్యాస రచయితలు పేర్కొన్నారు. 

 

బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకారి అనే విషయం తెలిసిందే. ఇది వూహన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ కన్నా 70 శాతం ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో 150 స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. కోవాగ్జిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ దశలో ఉందని ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ ప్రకటించింది. దీనిని ఎమర్జెన్సీ వినియోగం కోసం అనుమతి ఇచ్చింది. కోవాగ్జిన్‌ను తీసుకున్నవారిని నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపింది.