జనసేనకు చిరంజీవి మద్దతు

Published: Wednesday January 27, 2021

 à°°à°¾à°¬à±‹à°¯à±‡ రోజుల్లో జనసేనకు చిరంజీవి మద్దతు ఉండనుందని నాదెండ్ల మనోహర్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం మాట్లాడిన ఆయన.. పవన్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమని తెలిపారు. à°“ రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. 

 

నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అంతేకాదు రానున్న తిరుపతి ఉపఎన్నికలో జనసేన నిలిస్తే... పార్టీకి చిరంజీవి మద్దతుగా నిలుస్తారన్న టాక్ వినపడుతోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌à°•à°¿ చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన గెలుపునకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.