భారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు

Published: Thursday January 28, 2021

త్వరలోనే భారత్ గడ్డ నుంచి మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. à°ˆ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తామన్నారు. దావోస్‌లో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ à°—à°¾ ప్రసంగించారు. ఇప్పటికే భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించామని, త్వరలోనే భారత్ గడ్డపై నుంచి మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయని ఆయన తెలిపారు. ‘‘కోవిడ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాం. మానవ వనరులను కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటున్నాం. కోవిడ్‌ను గుర్తించడానికి, కోవిడ్ పరీక్షకు అవసరమైన సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం.’’ అని మోదీ సమ్మిట్ దృష్టికి తీసుకొచ్చారు.

ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించామని, అది శరవేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కేవలం 12 రోజుల్లోనే 23 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని మోదీ వివరించారు. ఇప్పటి వరకూ 150 దేశాలకు ఆవశ్యకమైన ఔషదాలను పంపిణీ చేశామని, అది తమ బాధ్యతగా భావిస్తామన్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్లను కూడా పంపిణీ చేయడానికి సిద్ధమే అని ఆయన ప్రకటించారు. కరోనా కారణంగా భారత్ ఘోరంగా దెబ్బతింటుందని, భారత్‌లో ‘కోవిడ్ సునామీ’ రాబోతోందని కొందరు హెచ్చరించారని గుర్తు చేశారు. అంతేకాకుండా డెబ్బై, ఎనబై లక్షల మందికి కోవిడ్ సోకే ఛాన్స్ ఉందని, 20 లక్షల మంది కోవిడ్ సోకి చనిపోతారని కూడా పేర్కొన్నారని, అయితే భారత్ మాత్రం అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు.