సాగర తీరం రూపురేఖలు మారిపోనున్నాయ్

Published: Saturday January 30, 2021

విశాఖపట్నంలోని రుషికొండ సాగర తీరం రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే దీనికి పరిశుభ్రమైన బీచ్‌à°—à°¾ ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు లభించింది. తాజాగా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇక్కడ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం కట్టింది. కొండపైన హరిత రిసార్ట్స్‌ను కూల్చేసి, మొత్తం చదును చేసి 65 ఎకరాల విస్తీర్ణంలో ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి నిర్ణయించింది. 

 

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి 12 ప్రాంతాలను గుర్తించామని, వాటిలో ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా ఏడు/ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తామని à°—à°¤ డిసెంబరులో పర్యాటక శాఖ ప్రకటించింది. à°† జాబితాలో రుషికొండ కూడా ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తున్న నేపథ్యంలో, రుషికొండకు సమీపానే ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని ప్రచారం జరుగుతున్నందున à°ˆ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం à°ˆ కొండపై 15 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్‌ ఉన్నాయి. రెస్టారెంట్‌, కాటేజీల ద్వారా ఏపీటీడీసీకి ఏడాదికి రూ.8 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి బుకింగ్స్‌ నిలిపేశారు. ఇక్కడున్న 55 కాటేజీలను ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారని ముందు ప్రచారం జరిగింది. కానీ వాటిని కూల్చేసి, భారీ నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఏపీటీడీసీ మూడు రోజుల క్రితం ఆంగ్ల పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. 

రుషికొండ మొత్తం విస్తీర్ణం 108 ఎకరాలు. అందులో 15 ఎకరాల్లో హరిత రిసార్ట్స్‌ ఉన్నాయి. ఇప్పుడు 65 ఎకరాల విస్తీర్ణంలో కొండను చదును చేసి, రహదారులు నిర్మిస్తామని ఏపీటీడీసీ పేర్కొంది. మొదటి దశలో కేవలం కొండను చదును చేసి, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.53 కోట్లు వెచ్చించనున్నట్టు టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రెండో దశలో 5 నక్షత్రాల హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఆడిటోరియం, స్పోర్ట్స్‌ సెంటర్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు సంబంధించిన నిర్మాణాలు చేపడతామని వివరించింది. à°ˆ పనులు చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చింది.