తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రకు రెడీ..

Published: Tuesday February 02, 2021

ప్రతి ఒక్కరికీ అంతరిక్షంలోకి వెళ్లాలని, అక్కడి వింతలు-విశేషాలను కళ్లారా చూడాలని ఉంటుంది. కానీ à°† à°•à°² ఎంతో మందికి కలగానే మిగిలిపోయింది. అయితే అలాంటి వారి కలల్ని సాకారం చేయడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నాడు ఎలాన్ మస్క్. తన స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రపంచంలోనే తొలి ప్రయివైటు అంతరిక్షయానానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను వడివడిగా చేసేస్తున్నాడు. à°ˆ ఏడాది చివరికల్లా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి కచ్చితంగా ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం డ్రాగన్ క్రూ క్యాప్సుల్‌ను వినియోగించనుంది. à°ˆ క్యాప్సూల్‌ ద్వారా నలుగురు వ్యక్తుల్ని కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది.

 

 

‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ à°ˆ వ్యోమనౌకకు నాయకత్వం వహిస్తారని స్పేస్ఎక్స్ తెలిపింది. స్పేస్ క్యాప్సుల్‌లోని నాలుగు సీట్లను ఆయనే కొనుగోలు చేశారని, అందువల్ల మిగిలిన ముగ్గురి పేర్లను ఆయనే నిర్ణయిస్తారని స్పేస్ ఎక్స్ వెల్లడిచింది. 

 

 

ఇదిలా ఉంటే à°ˆ స్పేస్ జర్నీ కోసం వ్యోమగాములకు అవసరైన శిక్షణను ఇన్‌స్పిరేషన్-4 సిబ్బంది ఇవ్వనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. దీనికోసం డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడంతో పాటు ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌స్పిరేషన్-4 వెల్లడించింది. 

 

 

à°ˆ స్పేస్ జర్నీ కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, అందులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ ప్రతి 90 నిముషాలకు భూమి చుట్టూ à°’à°• చుట్టు తిరుగుతుందని స్పేస్ ఎక్స్ వెల్లడిచింది. దీనికోసం à°“ నిర్దేశిత కక్ష్యను కూడా నిర్ణయించనున్నట్లు తెలిపింది. మొత్తం ట్రిప్ ముగిసిన తరువాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ చేయనున్నట్లు ప్రకటించింది.