గూగుల్‌కు ఊహించని షాక్!

Published: Wednesday February 03, 2021

 à°µà°¾à°°à±à°¤à°¾ సంస్థలకు సంబంధించి కొత్త చట్టం కారణంగా ఆస్ట్రేలియా-గూగుల్ మధ్య నెలకొన్న వివాదం బుధవారం మరో కీలక మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా రూపొందించిన à°ˆ చట్టాన్ని సమర్థిస్తున్నామంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గూగుల్‌కు ఊహించని షాకిచ్చింది. గూగుల్ వ్యతిరేకిస్తున్న చట్టానికి మద్దతు తెలుపుతూ మైక్రోసాఫ్ట్ చేసిన à°ˆ ప్రకటన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. 

 

 

మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను వినియోగించుకున్నందుకు ఫేస్‌బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు ఆయా సంస్థలకు కొంత మొత్తం చెల్లించాలంటూ ఆస్ట్రేలియా కొత్త చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. అయితే..à°ˆ చట్టాన్ని గూగుల్ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాదని చెబుతున్న గూగుల్..తప్పనిసరైతే ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలు నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. అయితే.వార్తల లింకులను తన సెర్చ్ ఫలితాల్లో చూపించడం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లు వినియోగదారులను ఆకర్షించగలుగుతున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం వాదిస్తోంది. à°ˆ కారణంగానే.. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని మీడియా సంస్థలతో పంచుకోవాలని స్పష్టం చేస్తోంది. 

 

 

à°ˆ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ తాజాగా చేసిన ప్రటకన సంచలనం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ వాటా ఏకంగా 93 శాతం. దీంతో..ఆస్ట్రేలియా నుంచి గూగుల్ వైదొలగితే ఏం జరుగుతుందనే అంశం పెద్ద చర్చకు దారితీసింది. à°ˆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. à°ˆ విషయమై ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని ఇటీవల à°“ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ స్థానాన్ని భర్తీ చేసే శక్తి తమకు ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్యా నాదెళ్ల తనతో వ్యాఖ్యానించినట్టు ఆయన పేర్కొన్నారు. à°ˆ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన ఆస్ట్రేలియా-గూగుల్ వివాదాన్ని మరో కీలక మలుపు తిప్పినట్టైంది. ‘డిజిటల్ వేదికలు, సంప్రదాయిక వార్త సంస్థల మధ్య సమతుల్యం సాధించేందుకు à°ˆ చట్టం ప్రధానం ఉద్దేశ్యం. ఇందిలో మా ప్రస్తావన లేకపోయినప్పటీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశిస్తే à°ˆ చట్టానికి మేము బద్ధులమై ఉంటాము’ అని మైక్రోసాఫ్ట్  పేర్కొంది