ఓటీపీకే ప్రాధాన్యమిస్తున్న డీలర్లు..

Published: Thursday February 04, 2021

పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో రేషన్‌ లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. రేషన్‌ షాపుల్లో సరుకులు పొందేందుకు ఐరిస్‌ (కనుపాపలు) లేదా వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విధానాన్ని ఈనెల 1 నుంచి తప్పనిసరి చేయడంతో వారంతా ఇప్పుడు మీసేవ, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వేలిముద్రలకు ప్రత్యామ్నాయంగా ఐరిస్‌  విధానం అందుబాటులో ఉన్నా... ఓటీపీకే డీలర్లు ప్రాధాన్యమిస్తుండడంతో లబ్ధిదారులకు à°ˆ తిప్పలు తప్పడం లేదు. మీసేవ సెంటర్ల వద్ద లైన్లలో నిల్చోలేక ఇబ్బంది పడటంతో పాటు, కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా à°ˆ పరిస్థితి నెలకొంది.

 

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట ఆధార్‌ కేంద్రం వద్ద à°“ వృద్ధురాలు సొమ్మసిల్లి పడి పోయారు. వికారాబాద్‌ జిల్లాలో ఉదయం 4 గంటలకే ఆధార్‌ సెంటర్‌కు చేరుకొని, అక్కడే చలిమంట పెట్టుకొని కాచుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చెప్పులు వరుసలో పెట్టారు. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జనగామ, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. తిండి, తిప్పలు లేక అవస్థలు పడ్డారు. కుమ్రం భీం జిల్లాలో ఆధార్‌ కేంద్రాల వద్ద తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో సీడింగ్‌ ప్రకియ ఆలస్యంగా జరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో రేషన్‌ దుకాణాల వద్ద తాత్కాలికంగా ఐరిస్‌ యంత్రాలను అందుబాటులో ఉంచారు. మరోవైపు, ఆధార్‌-సెల్‌ నంబర్‌ అనుసంధానానికి మీసేవ సెంటర్లలో రూ.50 చార్జి చేయాల్సి ఉండగా రూ.100 నుంచి రూ.200 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. 

మీసేవ, ఆధార్‌ సెంటర్లలో రోజుకు 30-40 వరకు మాత్రమే ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆధార్‌ కేంద్రాల్లో ఒక్కో కార్డుకు లింక్‌ చేసేందుకు కొన్నిచోట్ల అరగంటకుపైగా సమయం పడుతుండడంతో క్యూలైన్‌లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. 

 à°°à±‡à°·à°¨à±‌ డీలర్లు ‘ఓటీపీ’ వైపే మొగ్గుచూపుతున్నారు. కానీ వినియోగదారులందరికీ ఆధార్‌-సెల్‌నంబర్‌ అనుసంధానం జరగలేదు. రాష్ట్రంలో 87,56,012 రేషన్‌ కార్డులుంటే... వాటిపై లబ్ధిదారులు 2,80,58,651 మంది ఉన్నారు. వీరిలో సగం మంది లబ్ధిదారులకు చెందిన సెల్‌ఫోన్‌ నంబర్లు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నడిచే ప్రజాపంపిణీ వ్యవస్థంతా ‘ఆధార్‌’ సర్వర్‌తో అనుసంధానమై పని చేస్తోంది. ఆధార్‌లో వేలిముద్రలు, కనుపాపలు ఉన్నప్పుడు... రేషన్‌ డీలర్లు à°ˆ రెండింటికీ స్వస్తిచెప్పి ఓటీపీ విధానాన్నే అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఐరిస్‌ యత్నాలు చేసినా... వృద్ధులకు కళ్లు కనిపించకపోవటం, కను పాపలు స్కాన్‌ కాకపోవటం, కొందరు à°•à°‚à°Ÿà°¿ ఆపరేషన్లు చేసుకోవటం, కొన్నిచోట్ల సర్వర్‌ పనిచేయక పోవటం కూడా సమస్యగా మారింది. అయితే తొలుత ఐరిస్‌, అది సాధ్యంకాక పోతేనే‘ఓటీపీ’ విధానాన్ని వినియోగించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.