ఎన్నికలకు 1800 మందితో బందోబస్తు

Published: Saturday February 13, 2021

 

పంచాయతీ ఎన్నికలకు నర్సీపట్నం డివిజన్‌లో 1800 మంది పోలీసుల సేవలను వినియోగిస్తున్నట్టు ఏఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పంచాయతీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. 2500 మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశామని వివరించారు.  మండలానికి à°’à°• స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, సర్కిల్‌ స్థాయిలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సు ఏర్పాటు చే శామన్నారు. బ్యాలెట్‌ బాక్సులు తరలించేటప్పడు ప్రత్యేక బలగాలు, అక్టోపస్‌ బృందాలను ఉపయోగిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనా ఇబ్బంది లేకుండా అవసరమైన బందోబస్తును సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైతే రిజర్వ్‌ఫోర్స్‌ కూడా అందుబాటులో ఉన్నారని వివరించారు.