జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలి

Published: Sunday February 14, 2021

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారని.. కాని పవన్ ఢిల్లీ వెళ్లగానే ధోరణి మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు‌ను ఇనుప తుక్కుగా మార్చి కేంద్రం సంపన్నులకు కట్టబెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా ప్రమాదకరమన్నారు. కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీకి తీరని నష్టాన్ని కలిగిస్తోందని చెప్పారు. ప్రభుత్వ రంగంలోనే పరిరక్షించుకోవడం ఆంధ్రుల కర్తవ్యం అన్నారు. à°—à°¤ స్ఫూర్తితోనే మళ్లీ  ఉద్యమం జరగాలని చెప్పారు. ఏపీ ఏర్పడిన నాటి నుంచి  విశాఖ ఉక్కు చరిత్ర ఉందన్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ఆమ్మడం తప్పితే  ఏం అభివృద్ధి చేయడం లేదని ధ్వజమెత్తారు.  ఆంధ్ర పౌరుషం మీద ఆత్మవిశ్వాసం మీద బీజేపీ దెబ్బకొడుతోందని మండిపడ్డారు. ఏపీ సమగ్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైనా ఏపీలో అడుగు పెడతానంటే .. ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలకతీతంగా విశాఖ ఉక్కు పోరాటంలో భాగస్వాములు కావాలని బీవీ రాఘవులు పిలుపునిచ్చారు.