మూడో దశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు

Published: Tuesday February 16, 2021

బుధవారం à°®à±‚డో దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. à°ˆ మేరకు ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 579 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 31,516 వార్డు మెంబర్లకుగాను 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. à°ˆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో ఏర్పాట్లు. ఓటు హక్కు ను 55,75,004 మంది ఓటర్లు  వినియోగించుకోనున్నారు’ అని తెలిపారు.

‘మూడో దశలో 2,642 సర్పంచ్ స్థానాలకుగాను విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్క 'నో' నామినేషన్ వల్ల 2,639 స్థానాలకు 7,757 మంది అభ్యర్థులు. వార్డు మెంబర్ల 19,763 స్థానాలకుగాను 210 స్థానాలలో నామినేషన్ లేకపోవడంతో 19,553 వార్డు మెంబర్ల స్థానాలకుగాను 43,162 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో దశ ఎన్నికలకుగాను 26,851 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. అందులో 4,118 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, 3,127 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 1,977 నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లుగా గుర్తింపు. స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,289 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 3,246 మంది. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,204 మంది, ప్రీసైడింగ్ ఆఫీసర్లుగా 29,266 మంది, ఇతర పోలింగ్ సిబ్బందిగా 46,753 మంది నియామకం’ చేసినట్లు వెల్లడించారు.

‘జోనల్ అధికారులుగా 545 మంది, రూట్ అధికారులుగా 1,210 మంది. పోలింగ్ తేదీ రోజు పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు మైక్రో అబ్వర్వర్స్ à°—à°¾ 3,025 మంది నియామకం. మూడో దశలో పోలింగ్ కోసం 160 డిస్టిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అన్ని పోలింగ్ స్టేషన్లకు మూడో దశ పోలింగ్‌కు అవసరమైన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా డిస్టిబ్యూషన్లు. పోలింగ్ సిబ్బంది, సామాగ్రిని డిస్టిబ్యూషన్ సెంటర్ల నుంచి 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలింపు.ఇందుకోసం అవసరమైన 2,192 పెద్ద వాహనాలు, 5 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లను తరలించేందుకు 1,674 చిన్న వాహనాలు ఏర్పాటు. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ, అవసరమైన సామాగ్రి అందుబాటులో...మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లౌవ్స్ అవసరమైన సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం’ చేసినట్లు చెప్పారు.

‘కోవిడ్ పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం. పోలింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు. కౌంటింగ్ కోసం కౌంటింగ్ సెంటర్లను పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య, కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకుగాను కమిషనర్, పంచాయతీరాజ్ కార్యాలయంలో పనిచేస్తున్న 13 మంది అధికారులను జిల్లాకు à°’à°•à°°à°¿ చొప్పున ఏర్పాటు. ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకుగాను కమిషనర్, పంచాయతీరాజ్ కార్యాలయంలో కమాండ్ కంట్రోలో సెంటర్ ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సిబ్బందిని నియమించి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్లలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 6.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు మాత్రమే పోలింగ్’ జరగనుందని ద్వివేది పర్కొన్నారు.