తాడోపేడో తేల్చుకుందాం...సిద్ధం కండి

Published: Wednesday February 17, 2021

విశాఖ ప్రజలు ఏదైనా అనుకుంటే సాధిస్తారని, à°† విషయం 60 ఏళ్ల క్రితమే విశాఖ ఉక్కు పోరాటంతో నిరూపించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో పోరాటం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేపట్టగా, ఆయన్ను పరామర్శించేందుకు చంద్రబాబు మంగళవారం నగరానికి వచ్చారు. కిమ్స్‌ ఆస్పత్రిలో వున్న ఆయన్ను పరామర్శించాక...అక్కడే మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. à°† తరువాత కూర్మన్నపాలెంలో అఖిలపక్షం నాయకులు రిలే దీక్షలు చేస్తున్న కార్మికులను, నిర్వాసితులను కలిసి సంఘీభావం ప్రకటించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆనాడు ‘ఆంధ్రుల హక్కు...విశాఖ ఉక్కు’ అంటూ ఎలాగైతే పోరాడారో...అదేవిధంగా ఇపుడు స్టీల్‌ప్లాంటుని రక్షించుకోవడానికి పోరాడాలన్నారు. మహాసర్పం కూడా చలిచీమల చేతిలో చనిపోతుందని, ప్రజలు పోరాటం చేస్తే ఏ ప్రభుత్వమైనా దిగి రాక తప్పదన్నారు. అంతా సంఘటితంగా ఉంటూ, చెడును ఖండించాలన్నారు. పల్లా శ్రీనివాసరావు దొంగ దీక్ష చేయలేదని, చిత్తశుద్ధితో ఆమరణ దీక్ష చేశాడని, అందుకే ఆరు రోజుల్లో పది కిలోలు బరువు తగ్గాడన్నారు. ఆయన అంకితభావాన్ని, నియోజకవర్గ ప్రజల కోసం చేపట్టిన సాహసాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పారు. ఉక్కు పరిరక్షణ దీక్షకు పల్లా ప్రాణం పోశాడని, దానిని కాపాడుకోవడానికి కలిసి పోరాడడానికి అంతా సంఘటితం కావాలన్నారు. విశాఖపట్నం ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని, విశాఖ ప్రజల ఆత్మ అయిన ప్లాంటుపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని, ఉద్యమంలో అంతా పాలుపంచుకోవాలన్నారు. 

విశాఖలో ఐటీ అభివృద్ధికి పునాదులు వేశామని, ఆనాడు తీసుకొచ్చిన హెచ్‌ఎస్‌బీసీ కూడా పారిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. అదానీ డేటా సెంటర్‌తో ఒప్పందం చేసుకుంటే దాన్ని జాప్యం చేశారని, లులూ షాపింగ్‌ మాల్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నారని, ఇలా విశాఖను విధ్వంసం చేయడానికే వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రాయలసీమ ముఠాల దందాలు, బెదిరింపులకు భయపడవద్దని, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలని సూచించారు. విశాఖ ప్రజలు భయపడొద్దని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.