10 జిల్లాల్లో 80శాతానికి పైగా ఓటింగ్‌: ఎస్‌ఈసీ

Published: Thursday February 18, 2021

పంచాయతీ ఎన్నికల మూడో విడతలో 80.64 శాతం పోలింగ్‌ నమోదైంది. 87.09 శాతం ఓటింగ్‌తో విజయనగరం జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 69.28శాతంతో అత్యల్పంగా ఓట్లేసిన జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. శ్రీకాకుళం 80.13ు, తూర్పుగోదావరి 74.80ు, పశ్చిమగోదావరి 82.73ు, కృష్ణాజిల్లా 84.65ు, గుంటూరు 84.80ు, ప్రకాశం 82.42ు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 83.15ు, వైఎస్సార్‌ à°•à°¡à°ª 72.85ు, కర్నూలు 83.10ు, అనంతపురం 80.29ు, చిత్తూరు జిల్లాలో 83.04 శాతం చొప్పున ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 రెవెన్యూ డివిజన్లలోని 160 మండలాల్లో ఏర్పాటు చేసిన 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కాగా, తొలి విడతలో 81.41శాతం, రెండో విడతలో 81.61శాతం పోలింగ్‌ నమోదైంది. వీటితో పోలిస్తే మూడో విడతలో ఓటింగ్‌ స్పల్పంగా తగ్గింది. 

చిత్తూరు జిల్లా గంగవరం పోలింగ్‌ కేంద్రంలో ఆర్వో జయపాల్‌కు ఫిట్స్‌ రావడంతో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికేతరుడైన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కుప్పంలో పర్యటించడంపై, టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.