ఫేక్ ఫైజర్ టీకా.. ఒక్కో డోస్ రూ.1.5 లక్షలు

Published: Friday February 19, 2021

అవసరం ఉన్న చోటే మోసం చేసే అవకాశం ఉంటుంది. à°ˆ విషయం మరోసారి రుజువైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ టీకాలను విక్రయిస్తూ లక్షలు గడించారు. విషయం తెలియని ప్రజలు భారీ సొమ్ము చెల్లించి సదరు టీకాను వేయించుకుంటున్నారు. విషయం పోలీసులకు చేరడంతో నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. à°ˆ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అమెరికాలో తయారైన ఫైజర్ టీకాను అందిస్తున్నామంటూ ఉత్తర మెక్సికోలోని మాన్‌టెర్రీ ప్రాంతంలోని à°“ క్లినిక్‌లో డాక్టర్లు స్థానిక ప్రజలకు చెప్పారు. ఒక్కో టీకా ఖరీదు రూ.1.5 లక్షలుగా నిర్ధారించారు. దీంతో అనేకమంది à°…à°‚à°¤ సొమ్ము చెల్లించి టీకా తీసుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు à°† ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడున్న ఆరుగురు సిబ్బందిని బుధవారం అరెస్టు చేశారు. à°ˆ ఘటనపై మెక్సికో అసిస్టెంట్ హెల్త్ సెక్రటరీ హూగో లోపెజ్ గల్లెట్ మాట్లాడుతూ.. సదరు క్లినిక్‌లో ఫైజర్ టీకా పేరుతో నకిలీ టీకాలను అందిస్తున్నారని, దాని కోసం ఏకంగా 2వేల డాలర్లను వసూలు చేస్తున్నారని చెప్పారు.