సీఎం జగన్ ఆధ్యాత్మిక సందర్శన

Published: Saturday February 20, 2021

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి శుక్రవారం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ సందర్శన అసాధారణ భద్రత నడుమ సాగింది. అడుగడుగునా à°•à° à°¿à°¨ పోలీసులు à°•à° à°¿à°¨ ఆంక్షలు విధించడంతో అధికార వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం సీఎం పర్యటనలో పాల్గొనే అవకాశం దక్క లేదు. రథసప్తమి సందర్భంగా రథాన్ని లాంఛనంగా ప్రారంభించిన ప్పటికీ అంగుళం కూడా రథం కదల్చకుండానే సీఎం వెనుదిరగడంలో భక్తులు తీవ్ర నిరాశ, నిస్తృహలకు లోనయ్యారు. ముఖ్యమంత్రి జగన్మో హనరెడ్డి తాడేపల్లి నుంచి 11.50 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు పినిపే విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనితతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు  స్వాగతం పలికారు. అనంతరం నేరుగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రాజగోపురంనకు చేరుకున్న సీఎంకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన ఆధ్వర్యంలో అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన జగనకు వేదాశీర్వచనం ఇచ్చి శేషవస్త్రంతోపాటు ప్రసాదా లను అందించారు. ఆలయ చరిత్ర, రథం తయారీకి సంబంధించిన దృశ్యమాలికను సీఎం వీక్షించి పశ్చిమరాజగోపురం చెంతనే ఉన్న 33 ఎకరాల ఖాళీ స్థలాన్ని పరిశీలించి à°† ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలి సింది. తరువాత నేరుగా రూ.1.16 కోట్లతో నిర్మించిన రథం వద్దకు చేరుకున్న సీఎం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ హారతి ఇచ్చి à°† తరువాత తాడును పట్టుకుని రథం ముందు నిలుచున్నారు. అక్కడి నుంచి సీఎం పర్యటన ముగించుకుని నేరుగా హెలిప్యాడ్‌కు వెళ్లిపో యారు. వాస్తవానికి రథసప్తమి సందర్భంగా స్వామివారి నూతన రథా న్ని ముఖ్యమంత్రి జగనతో లాగింపజేయాలని నిర్ణయించారు. రథాన్ని లాగేందుకు వాహనకారులను కూడా భారీగా సిద్ధం చేశారు. సీఎం తాడు ముందు భాగానికి చేరుకుని పూజా కార్యక్రమాల తర్వాత మంత్రులతో కలసి మీడియాకు కనిపించి పర్యటన ముగించుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న వాహనకారులతో పాటు భక్తులు నిశ్చేష్ఠులయ్యారు. సీఎం వెళ్లిన తర్వాత రథం షెడ్డు నుంచి స్వామివారి నూతన రథాన్ని వాహనకారులు, పోలీసులు, ద్వితీయశ్రేణి నాయకులు కదలించి కొంచెం ముందుకు తీసుకువచ్చారు. à°† సమయంలో భక్తులు గోవిందా గోవిందా అంటూ పెద్దపెట్టున నినదించారు.