తానా సదస్సులో అమ్మభాషపై ఉపరాష్ట్రపతి సందేశం

Published: Sunday February 21, 2021

అమ్మను, జన్మభూమిని, మాతృభాషను ఎన్నడూ మరిచిపోరాదని ప్రతి సమావేశంలో చెప్పే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం అంతర్జాతీయ  మాతృభాషా దినోత్సవం సందర్భంగా తల్లి భాష పట్ల తనకుగల ప్రేమానురాగాలను చాటిచెప్పే అనేక వినూత్న చర్యలు చేపట్టారు. ఆత్మతో సమానమైన తల్లి భాషను ప్రోత్సహించాల్సిందిగా ఆయన రాజ్యసభలోని 245 సభ్యులకు లేఖ రాశారు. మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆంగ్లంలోనే కాక  దేశంలో 22 ప్రాంతీయ భాషల్లో ఆయన రాసిన వ్యాసాలు ఆదివారం ప్రచురిత à°‚ కానున్నాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ లోని ముచ్చింతల లోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన సుద్దాల అశోక్‌ తేజ, మాడుగుల నాగఫణి శర్మ, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రభృతుల సమక్షంలో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 11 గంటలకు   à°•à±‡à°‚ద్ర విద్యాశాఖ, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న  కార్యక్రమంలో వెబినార్‌ ద్వారా ప్రసంచనున్నారు. 

 

రాత్రి ఏడు గంటలకు ‘‘అమ్మ భాష తెలుగు- మన శ్వాస’’ అన్న అంశంపై   à°‰à°¤à±à°¤à°° అమెరికా తెలుగు సంఘం (తానా ) నిర్వహించనున్న అంతర్జాతీయ సద స్సులో  ఉపరాష్ట్రపతి సందేశాన్ని వినిపించనున్నారు.  కాగా, పార్లమెంట్‌ సభ్యులకు రాసిన మూడు పేజీల లేఖలో...తల్లి భాష మూలంగానే విద్యార్థి జ్ఞానసముపార్జనకు బలమైన పునాది ఏర్పడుతుందని వెంక య్య  పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోకపోతే అది కనుమరుగైపోతుందని, ఇప్పటికే 200 భారతీయ భాషల అస్థిత్వం ప్రమాదంలో పడ్డాయని వెంకయ్య చెప్పారు. ఆంగ్లంలో మాట్లాడడం ఆధిపత్యంగా భావించి  మాతృభాషను మనమే చులకనచేసే మనస్తత్వాన్ని వదులుకోవాలని ఆయన కోరారు. తల్లి భాషను కాపాడుకోవడం ద్వారానే  దేశంలో ఉన్న వైవిధ్యమైన సంస్కృతిని రక్షించుకోగలమని పేర్కొన్నారు. భాష, సంస్కృతి బొమ్మా బొరుసులాంటివని ఆయన గుర్తుచేశారు.