స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా

Published: Tuesday February 23, 2021

గుజరాత్‌లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికారిక భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవలం చేసుకుని తన ఏకచత్రాధిపత్యాన్ని నిలుపుకుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ à°ˆ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిపోయింది. అతి తక్కువ స్థానాలు గెలుచుకుని తన ప్రభావాన్ని మరింత కోల్పోయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సూరత్ మున్సిపాలిటీలో 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దేశ వ్యాప్తంగా ఖాతాలు తెరుస్తున్న అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం à°ˆ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుని గుజరాత్‌ ఎంట్రీ ఇచ్చింది.

 

అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జాంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. కాగా మొత్తం 576 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు 404 స్థానాల తుది ఫలితాలు వెలువడ్డాయి. à°ˆ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 341 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 38 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అహ్మదాబాద్‌లో 125 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 101 స్థానాలు గెలుకుంది. కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక ఎంఐఎం 4 స్థానాలను గెలుచుకుంది. సూరత్, వోడదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జాంనగర్ మున్సిపాలిటీ ఫలితాల్లోనూ ఇదే తంతు కనిపించింది. ఇక సూరత్‌ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చింది. 120 స్థానాలున్న à°ˆ మున్సిపాలిటీలో బీజేపీ 93 స్థానాల్లో విజయం సాధించింది.