ప్రధానికి మరోసారి జగన్ లేఖ

Published: Tuesday March 09, 2021

విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం తెగేసిచెప్పిన విషయం తెలిసిందే. అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రకటనతో ఏపీ మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. à°ˆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేందుకుగాను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయిట్‌మెంట్ కోరుతూ మంగళవారం నాడు లేఖ రాశారు. ఇప్పటికే ఒకసారి ప్రధానికి లేఖ రాసిన జగన్.. ఇప్పుడు నేరుగా ప్రధానిని కలిసేందుకు జగన్ అనుమతి కోరుతూ మరో లేఖ రాశారు. ఢిల్లీకి తనతో పాటు రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో వచ్చి కలుస్తానని లేఖలో సీఎం వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాను రాసిన లేఖ విషయాన్ని కూడా తాజా లేఖలో సీఎం ప్రస్తావించారు. 

 

‘32 మంది ప్రాణ త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. 2002-2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ప్లాంట్‌కు ఉన్న 19700 ఎకరాల భూమి విలువ రూ.లక్ష కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 2014-15లో స్టీల్‌కు ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లింది. ఉత్పత్తి ఖర్చు పెరగడానికి కారణం సొంత గనులు లేకపోవడమే. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు సొంత గనులు కేటాయించాలి. ఉపయోగించకుండా ఉండిపోయిన 7వేల ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయిస్తే ఆర్ఐఎన్ఎల్‌కు నిధులు సమకూరుతాయి. భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులిస్తుంది. à°ˆ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి’ à°…ని మోదీకి రాసిన లేఖలో జగన్ కోరారు. అయితే పీఎంవో నుంచి à°ˆ లేఖపై ఎలాంటి రిప్లయ్ వస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ప్రతిపక్ష, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు మాత్రం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.