స్పిల్‌వే పనులు 2021 మే నాటికి..

Published: Tuesday March 09, 2021

పోలవరం ప్రాజెక్టు పనులు 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జలశక్తి సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా వెల్లడించారు. 2020 నవంబరులో జరిగిన 13à°µ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి చేసే వ్యవధి లక్ష్యాన్ని సవరించినట్లు రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ à°…à°¡à°¿à°—à°¿à°¨ à°’à°• ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. తొలుత ప్రాజెక్టును 2021 డిసెంబరులో పూర్తి చేయాలని భావించినట్లు గుర్తు చేశారు.

 

ప్రస్తుతం స్పిల్‌వే పనులను 2021మే నాటికి, రేడియల్‌ గేట్ల బిగింపు పనులను à°ˆ ఏడాది ఏప్రిల్‌ నాటికి, కాఫర్‌ డామ్‌ పనులను వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కటారియా తెలిపారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డామ్‌ గేప్‌-2 పనులు, కుడి, à°Žà°¡à°® ప్రధాన కాలువల పనులతోపాటు.. భూ సేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపు ప్రక్రియను 2022 ఏప్రిల్‌ నాటికి నాటికి పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు