వేసవిలో సీజనల్‌ వ్యాధులు మరోవైపు వైరస్‌ భయం

Published: Sunday March 14, 2021

 à°à°Ÿà±€ ఉద్యోగి రాజశ్రీ (పేరు మార్చాం) à°•à°¿ ఆకస్మాత్తుగా ఒళ్లు వెచ్చగా అనిపించింది. సాయంత్రానికి జ్వరం తీవ్రత పెరిగి, à°’à°‚à°Ÿà°¿ నొప్పులు ఎక్కువయ్యాయి. దగ్గు, జలుబు కూడా. దీంతో ఆమె తనకు జర్వం వచ్చిందా, లేక కరోనా వైరస్‌ సోకిందా అని భయాందోళనకు గురైంది. ఇలా పలువురు తమకు జ్వరమా, కరోనానా అన్న విషయం తెల్చుకోలేక ఇలా ఎందరో సతమతమవుతున్నారు. ఒంట్లో నలతగా ఉండి, దగ్గు, జలు బు ఉంటే వైరస్‌ సోకిందేమో అన్న భయంతో వణికిపోతున్నారు. వేసవి ప్రారం à°­à°‚ కావడంతో సీజనల్‌ జ్వరాలు వస్తున్నాయి. à°ˆ కాలంలో à°Žà°‚à°¡ వల్ల చాలామందికి జ్వరం వచ్చి à°’à°‚à°Ÿà°¿ నొప్పులు, జలుబు, దగ్గు, తలనొప్పి, టైఫాయిడ్‌, అతిసార, వడదెబ్బ, కాళ్లు చేతులు వణకడం, నోరు ఎండిపోవడం, చెమటలు పట్టి శరీరం వేడెక్కడం, కొన్నిసార్లు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, వీటిని కొందరు కరోనాగా భావించి, ఆందోళన చెందుతున్నారు. పరీక్ష చేయించుకుంటే ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. 

కరోనా, సాధారణ జర్వం.. వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో కొందరు పరీక్షలు చేయించుకుంటే కరోనా అని తేలుతోంది. మరికొందరు నిర్లక్ష్యంగా పరీక్షలు చేయించుకోవడం లేదు. 

మొదటి రెండు రోజులు కరోనా, సాధారణ జ్వరం లక్షణాలు ఒకేలా కనిపిస్తాయి.  వైరల్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లలో 48 à°—à°‚à°Ÿà°² లోపల  వైర్‌సను గుర్తించడం కష్టం. à°† తర్వాతే వైర్‌సలో తేడాలు నిర్ధారించడం సులువు అవుతుంది. జ్వరం, దగ్గు, ముక్కుకారడం, ఆయాసం ఉంటే 72 à°—à°‚à°Ÿà°² తర్వాత ఆర్టీపీసీఆర్‌ చేయించుకోవాలి. అయిదు, ఆరు రోజులకూ కూడా జ్వరం తగ్గకుంటే కరోనా పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌తో సన్నిహితంగా ఉన్న వారికి లక్షణాలు కనిపిస్తే రెండు రోజుల తర్వాత పరీక్ష చేయించుకోవాలి.  జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అందరితో కలిసి భోజనం చేయడం, కూర్చోవడం చేయవద్దు.