కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫోటో

Published: Wednesday March 17, 2021

భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఏర్పాటుకు ప్రేరణ డాక్టర్ బి.ఆర్‌. అంబేడ్కర్‌. మరి స్వతంత్ర భారతదేశం ముద్రిస్తున్న కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మ లేకపోవడం చరిత్రను అగౌరవపరచడమే. మొదటి ప్రపంచ యుద్ధ కాలం (1914–19)లో మన దేశప్రజల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి నెట్టబడింది. 19à°µ శతాబ్దిలో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో తాము నెలకొల్పిన ప్రెసిడెన్షియల్‌ బ్యాంకులు మూడింటినీ 1921లో విలీనం చేసి ఇంపీరియల్‌ బ్యాంకుగా ఏర్పాటు చేసారు (ఇదే నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). 1920 దశకంలో రూపాయి విలువ పతనమవసాగింది. ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఈతిబాధల్లో చిక్కుకున్నారు. సగటు వ్యక్తి బతుకు కోణం నుంచి రూపాయి విలువ కాపాడేందుకు ఆర్థిక శాస్త్ర పారంగతుడు అంబేడ్కర్ సంకల్పించారు. 1926లో, తన అసమాన పాండిత్యంతో ‘ది ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ (రూపాయి సమస్య: దాని మూలం, పరిష్కారం) అనే పుస్తకాన్ని; ‘ఇండియన్‌ కరెన్సీ అండ్ బ్యాంకింగ్‌ చరిత్ర’ అనే మరో పరిశోధనా గ్రంథాన్ని ఆయన ప్రచురించారు. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతులను, చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు నాటి బ్రిటిష్ పాలకులు నియమించిన ‘రాయల్‌ కమిషన్‌’కు, ‘హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌’కు అంబేడ్కర్ అందజేసారు. భారతదేశానికి à°’à°• కేంద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చెయ్యాలని అంబేడ్కర్‌ తన ‘ఇండియన్‌ కరెన్సీ అండ్ బ్యాంకింగ్‌ చరిత్ర’లో ప్రతిపాదించారు. నాటి వైస్రాయి ఇర్విన్ ప్రభుత్వం అంబేడ్కర్ ప్రతిపాదనను ‘సైమన్‌ కమీషన్‌’ పరిశీలనకు నివేదించింది. అంబేడ్కర్ ప్రతిపాదనను ‘సైమన్‌ కమీషన్‌’ ఆమోదించింది. భారత్‌కు à°’à°• కేంద్రబ్యాంక్ అవసరాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గుర్తించింది.

 

కేంద్ర బ్యాంక్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును 1934లో ‘‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ ఆమోదించింది. 1935 ఏప్రిల్‌ 1à°¨ à°† చట్టం అమలులోకి వచ్చింది. భారతదేశపు కేంద్ర బ్యాంక్‌à°—à°¾ ‘రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్బీఐ) ఉనికిలోకి వచ్చింది. ‘బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం- 1949’ ప్రకారం ఆర్బీఐని జాతీయం చేశారు. ఆర్బీఐ ఏర్పాటు, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం- 1949 రెండూ అంబేడ్కర్ అనుపమాన మేధో కృషి ఫలితమేననడం సత్యదూరం కాదు. మరి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటుతున్నా మన కరెన్సీ నోట్లు ఒక్క దానిపై కూడా అంబేడ్కర్‌ బొమ్మ లేకపోవడం చాలా బాధాకరం. ఆర్బీఐ చరిత్రతో సంబంధం లేని మహనీయుల ఫోటోలను ముద్రిస్తున్నారు. ఇందుకు మేము వ్యతిరేకం కాదు. అయితే ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్‌ ఫోటోను ఎందుకు ముద్రించడం లేదు? ఇదే మా బాధ. à°† బాధతోనే ఆర్థిక దార్శనికుడు అంబేడ్కర్‌కు సరైన గుర్తింపు నివ్వకపోవడాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలలో ఆర్‌బిఐకి రూపకల్పన చేసింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్‌ అనే రాస్తున్నాము. చరిత్ర కూడా అదే చెబుతుంది. ఇప్పటికైనా à°ˆ చారిత్రక సత్యాన్ని గుర్తించి, అంగీకరించి భారతీయ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫోటోను ముద్రించాలని డిమాండ్‌ చేస్తున్నాము. ‘ఇండియన్ కరెన్సీ పై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షులుగా నేను ఇప్పటికే à°—à°¤ ఏడాది సెప్టెంబర్‌ 26-30 తేదీల మధ్య మహా పాదయాత్ర నిర్వహించాను. రెండోవిడతలో 2021 ఏప్రిల్‌ 14à°¨ అంబేడ్కర్‌ జయంతి వరకు ప్రజాచైతన్య రథయాత్ర జరుగుతోంది. అందులో భాగంగా జనవరి, ఫిబ్రవరిలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన సందర్భంగా అన్ని జాతీయ పార్టీల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు జి. కిషన్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలను స్వయంగా కలసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని వినతి పత్రం సమర్పించాం. పార్లమెంట్‌లో కచ్చితంగా à°ˆ అంశాన్ని లేవనెత్తుతామని వారు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ‘కరెన్సీ నోటుపై అంబేడ్కర్‌ ఫోటో’ బిల్లుపెట్టి ఆమోదించేలా చూడాలని పార్లమెంట్‌ సభ్యులను డిమాండ్‌ చేస్తున్నాం.