బడ్జెట్‌ సమావేశాలపై ప్రతిష్టంభన

Published: Thursday March 18, 2021

కాదంటే... ఔను! ఔను... అంటే కాదు! రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కూ, సర్కారు పెద్దలకూ మధ్య పిల్లీ ఎలుకా చెలగాటం కొనసాగుతూనే ఉంది. దీంతో... అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపైనే ప్రతిష్టంభన నెలకొంది. కరోనా నేపథ్యంలో à°—à°¤ ఏడాది ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీపై స్వయంగా ముఖ్యమంత్రే కస్సుమన్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరూ ఆయనను తిట్టిపోశారు. ఎన్నికలు పెట్టాల్సిందే అని ఒత్తిడి తెచ్చారు. ఇక... à°ˆ ఏడాది కరోనా కలవరం తగ్గిన తర్వాత ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమైన ఎస్‌ఈసీపై మరోసారి విరుచుకుపడ్డారు. అప్పుడు కావాలన్న వారే... ‘ఇప్పుడు ఎందుకు,  ఎలా ఎన్నికలు పెడతారు?’ అని నిలదీశారు. ఎన్నికలను ఆపేందుకు అనేక విఫల యత్నాలు చేశారు. మొత్తానికి... పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలు ముగిశాయి. మిగిలింది... పరిషత్‌ ఎన్నికలు మాత్రమే! పనిలో పనిగా వీటినీ ముగించాలని సర్కారు పెద్దలు పట్టుపడుతున్నారు.

 

అయితే... పరిషత్‌లో దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలు, ఉపసంహరణలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ à°—à°¤ ఏడాదే కేంద్ర హోంశాఖకు సుదీర్ఘ లేఖ రాశారు. అప్పట్లో జరిగిన అక్రమాలను అలాగే వదిలేసి... ఎన్నికల ప్రక్రియను కొనసాగించడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. అదే సమయంలో... విపక్షాలు కోరినట్లు ఎన్నికల ప్రక్రియను తిరిగి తాజాగా ప్రారంభించడమూ కుదరదు. à°ˆ నెలాఖరుతో తన పదవీకాలం ముగుస్తుండటంతో... ‘పరిషత్‌’ బాధ్యతను తదుపరి ఎస్‌ఈసీకి వదిలేయాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ... నిమ్మగడ్డతోనే à°ˆ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని సర్కారు పెద్దలు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.  సీనియర్‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి బుధవారం గవర్నర్‌ను కలిశారు. మరో సీనియర్‌ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై చర్చించిన ప్రివిలైజ్‌ కమిటీ, ‘విచారణకు అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీకి నోటీసు పంపిస్తాం’ అని పేర్కొనడం గమనార్హం. ఇక... పరిషత్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగానూ.. ఎన్నికలు వెంటనే నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.

 

న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఎస్‌ఈసీ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, à°† వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదనే విషయాన్ని నమోదు చేయాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఇవన్నీ... నిమ్మగడ్డపై ఒత్తిడి పెంచే వ్యూహాలుగా భావిస్తున్నారు. మరోవైపు... ఈనెల 22 నుంచి 25à°µ తేదీ వరకు ఆయన సెలవుపై వెళుతున్నారు. à°† తర్వాత ఆరు రోజులు మాత్రమే ఆయన పదవీ కాలం ఉంటుంది. అప్పట్లో మిగిలిన ప్రక్రియను ఇప్పుడు ముగించేందుకు ఆరు రోజులు చాలని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారు. కానీ... పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండాలన్నది సుప్రీం కోర్టు ఆదేశం! వెరసి... నిమ్మగడ్డ హయాంలో పరిషత్‌ ఎన్నికలు జరపడం సాం