45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా

Published: Tuesday March 23, 2021

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా వేస్తున్నారు. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ à°ˆ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. 

కరోనా టీకా తీసుకున్న తర్వాత మరణించిన వారెవరూ భారత్‌లో లేరని మంత్రి అన్నారు. కాబ్టటి అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.85 కోట్ల మందికి టీకాలు వేసినట్టు చెప్పారు. వీరిలో 80 లక్షల మంది రెండో డోసు కూడా వేయించుకున్నట్టు చెప్పారు. ఫిబ్రవరిలో రోజుకు 3.50 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా, మార్చిలో అది దాదాపు 15 లక్షలకు చేరుకుందని మంత్రి వివరించారు.