మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడొ

Published: Thursday March 25, 2021

 à°•à±‹à°µà°¿à°¡à±-19 మహమ్మారి ప్రభావం ప్రపంచ దేశాలపై విపరీతంగా ఉంది. ప్రజల జీవనోపాధిని మాత్రమే కాకుండా వ్యాపారాలను కూడా దెబ్బతీస్తోంది. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయోనని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎదురు చూడవలసి వస్తోంది. అయితే సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయనేదానిపై గ్లోబల్ సీఈవోల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. 2022 నాటికి కానీ పరిస్థితులు సాధారణ స్థితికి రావని అత్యధికులు భావిస్తుండగా, à°ˆ ఏడాది చివరినాటికి అది సాధ్యమవుతుందని మరికొందరు చెప్తున్నారు. కేపీఎంజీ సీఈవో ఔట్‌లుక్ పల్స్ సర్వే, 2021 నివేదిక à°ˆ వివరాలను వెల్లడించింది. 

కేపీఎంజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన అధ్యయనంలో 500 మంది గ్లోబల్ సీఈవోలను ప్రశ్నించింది. కోవిడ్-19 మహమ్మారిపై స్పందన, రానున్నమూడేళ్ళపై వారి దృక్పథం గురించి అడిగింది. 

2022కు ముందు వ్యాపారాలు సాధారణ స్థితికి చేరే అవకాశం వస్తుందనే ఆశ లేదని 45 శాతం మంది గ్లోబల్ సీఈవోలు చెప్పారు. అయితే 31 శాతం మంది గ్లోబల్ సీఈవోలు à°ˆ ఏడాది చివరికల్లా సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. à°ˆ మహమ్మారి వల్ల తమ వ్యాపార నమూనాను మార్చవలసి వచ్చిందని 24 శాతం మంది చెప్పారు. 

ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు ఎప్పుడొస్తారోననే ఆందోళన కూడా సీఈవోలను వేధిస్తోంది. 55 శాతం మంది సీఈవోలు తమ ఉద్యోగులకు కోవిడ్-19 వ్యాక్సిన్ à°Žà°‚à°¤ త్వరగా అందుబాటులోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే తెలియజేయాలని ఉద్యోగులను కోరాలనే అంశాన్ని 90 శాతం మంది సీఈవోలు పరిశీలిస్తున్నారు. మన దేశంలోని సీఈవోల్లో 94 శాతం మంది à°ˆ సమాచారాన్ని తెలియజేయాలని తమ ఉద్యోగులను కోరాలనుకుంటున్నారు. à°ˆ సమాచారం అందుబాటులో ఉంటే ఉద్యోగుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. 

కోవిడ్-19 వ్యాక్సిన్ భద్రత విషయంలో తప్పుడు సమాచారం వ్యాపిస్తుండటం పట్ల 34 శాతం మంది సీఈవోలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారం వల్ల ఉద్యోగులు వ్యాక్సినేషన్ చేయించుకోవడం మానేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగే వరకు ఉద్యోగులను కార్యాలయాలకు పిలవకూడదని అత్యధిక సీఈవోలు భావిస్తున్నారు. మన దేశంలోని సీఈవోల్లో 76 శాతం మంది à°ˆ విధంగా భావిస్తున్నారు. 

కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్, సీఈవో బిల్ థామస్ మాట్లాడుతూ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు కోవిడ్-19 నుంచి తమ ఉద్యోగులకు రక్షణ ఉందనే నమ్మకం కలగాలని సీఈవోలు భావిస్తున్నారని చెప్పారు.