ఇక ప్రశ్నపత్రాల రూపకల్పన వర్సిటీలకే

Published: Friday March 26, 2021

అటానమస్‌ కాలేజీల పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది. à°ˆ కాలేజీలకు కూడా సంబంధిత అఫిలియేటెడ్‌ వర్సిటీలు తయారు చేసిన ప్రశ్నపత్రాలే అందించనుంది. ఇంజనీరింగ్‌ కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నపత్రాలు రూపొందిస్తుంది.

 

అటానమస్‌, నాన్‌ అటానమస్‌ కాలేజీలన్నింటికీ ఒకే ప్రశ్నపత్రాలు ఉంటాయి. జవాబు పత్రాల వాల్యుయేషన్‌ కూడా జేఎన్‌టీయూలోనే జరుగుతుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో à°ˆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికే à°ˆ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ వివరించారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేరని చెప్పారు.

 

ప్రతి విద్యార్థి నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో  రావాలని ఆకాంక్షించారు. అందుకే ప్రతి కోర్సులో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు ఏం విలువ ఉంటుందన్నారు. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని జగన్‌ అభిప్రాయపడ్డారు. కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 9à°¨ జగనన్న విద్యా దీవెన, ఏప్రిల్‌ 27à°¨ వసతి దీవెన విడుదలపై à°ˆ సందర్భంగా అధికారులతో జగన్‌ సమీక్షించారు. à°ˆ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు అందజేస్తున్నామని, తద్వారా దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

 

కాగా à°ˆ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల మంది వరకూ పెరుగుదల వచ్చిందని అధికారులు తెలిపారు. విద్యా దీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదనే భరోసా వచ్చిందని అధికారులు వివరించారు. అందుకే గతేడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయని సీఎంకు వివరించారు. à°ˆ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలన్నారు. à°ˆ ఏడాది 6 వేల మంది పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలికసదుపాయాల కల్పన కోసం వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. à°ˆ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.