పెరుగుతున్న సచివాలయాల అద్దె బకాయిలు!

Published: Saturday March 27, 2021

వార్డు సచివాలయాలు నడుస్తున్న భవనాలకు అద్దె చెల్లింపు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేసిన సచివాలయాలకు ప్రభుత్వం నెలనెలా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు గొడవ చేస్తున్నారు. భవనాలను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో సిబ్బంది అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు/గ్రామ సచివాలయాలను ప్రారంభించింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకు à°’à°•à°Ÿà°¿ చొప్పున జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలకు అనుమతి ఇచ్చింది. నగరంలో జీవీఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల్లో వీటిని ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద భవనాలను అద్దెకు తీసుకున్నారు. ఇలా నగరంలో 220 సచివాలయాల వరకూ ప్రైవేటు భవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రైవేటు భవనాలకు అద్దె à°•à°¿à°‚à°¦ ఏడాదికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే సచివాలయ వ్యవస్థను అట్టాహాసంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భవనాల యజమానులకు అద్దె చెల్లించడాన్ని విస్మరించింది. సచివాలయాలు ప్రారంభించిన ఆరు నెలల వరకూ అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు ఆందోళనకు దిగారు. తక్షణం భవనాలను ఖాళీ చేసేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత సర్దుబాటు చేసుకోవచ్చుననే ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులు అప్పటికి బకాయిల à°•à°¿à°‚à°¦ సుమారు రెండు కోట్ల రూపాయల వరకూ చెల్లించారు. ఇది జరిగి ఏడాదైంది.

 

అప్పటి నుంచి ఇప్పటివరకూ అద్దె డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. జీవీఎంసీ కూడా స్పందించడం లేదు. ఏడాది కాలంగా అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలను ఖాళీ చేయండంటూ జీవీఎంసీ అఽధికారులను యజమానులను కోరుతున్నారు. కొంతకాలం వేచిచూడాలంటూ భవన యజమానులను బుజ్జగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ యజమానులు మాత్రం ఖాళీ చేసేయాల్సిందేనంటూ తరచూ సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి గొడవ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తొమ్మిదో వార్డు పరిధి విశాలాక్షి నగర్‌లో సచివాలయం నడుస్తున్న భవన యజమాని అద్దె చెల్లించనందున తక్షణం ఖాళీ చేయాలంటూ గొడవ చేశారు. భవనానికి తాళం వేసేస్తానంటూ హెచ్చరించడంతో సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే అద్దె చెల్లింపునకు ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో భవన యజమాని తన నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకూ అద్దె భవనాలకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వుండడంతో ఏం చేయాలనే దానిపై జీవీఎంసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. à°ˆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.