ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి పోలవరం: పవన్‌ కల్యాణ్‌

Published: Saturday March 27, 2021

రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిపట్ల ప్రతి ఒక్కరం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. à°ˆ విషయాన్ని విస్మరించి పోలవరం ముంపు ప్రాంతవాసుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలు.. జేసీబీలతో ఇళ్లను కూల్చి వేసి, ప్రజలు నివసిస్తూ ఉండగానే విద్యుత్‌ సరఫరా, ఇతర సదుపాయాలు నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో జనసేన బృందం à°† ప్రాంతాల్లో పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకుందన్నారు. నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి, అక్కడ అన్ని సదుపాయాలు కల్పిండంతోపాటు 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడినీ, యువతినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని, à°† తర్వాతే తరలించాలని డిమాండ్‌ చేశారు.

యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూర్చేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయని పవన్‌ చెప్పారు. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరం అన్నారు. నెల్లూరుకు చెందిన మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకులు, గిన్నిస్‌ రికార్డు పొందిన ప్రభాకర్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పవన్‌ సత్కరించారు. పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ద్వారా రూ.లక్ష చెక్‌ను ఆయనకు  అందజేశారు.