ఏయూలో కరోనా కలకలం

Published: Saturday March 27, 2021

ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న  65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయ్యింది. జిల్లా డీఎమ్‌హెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణతో మంత్రి ఆళ్ల నాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో 1500 వందల మందికి కరోనా పరీక్షలు చేయగా 65మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రతి రోజు 7వేల 5వందలు వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జిల్లాలో ఆరు కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కేజీహెచ్ హాస్పిటల్, అనకాపల్లి, విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్‌లో 15మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.