50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Published: Tuesday March 30, 2021

మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, ఐరోపా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా వెళుతుండడంతో ఈవారం మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా మార్కెట్లు 2 శాతం లాభాలను ఆర్జించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభపడ్డాయి.  

 

ఉదయం 49,331 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ à°’à°• దశలో 50,268 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1128 పాయింట్ల లాభంతో 50,136 వద్ద ముగిసింది. అలాగే 14,628 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ 14,876 వద్ద గరిష్ఠానికి చేరింది. ఆఖరికి 322 పాయింట్ల లాభంతో 14,829 వద్ద స్థిరపడింది. యూపీఎల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. మహింద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.