హైకోర్టులో బీజేపీ సహా ఔత్సాహికుల పిటిషన్లు

Published: Saturday April 03, 2021

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌(జడ్పీటీసీ, ఎంపీటీసీ)à°² ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి, ప్రక్రియను మొదటి నుంచి చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహికులు లింగాల భువనేశ్వరాచారి, బండి పూజిత, వడ్డి భార్గవ్‌ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు à°ˆ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎ్‌సఈసీ), ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాజ్యాలపై శనివారం మధ్యాహ్నం 2.15à°•à°¿ విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. à°ˆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియకు తాజా నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడాన్ని సవా ల్‌ చేశామన్నారు. వ్యాజ్యానికి సంబంధించిన కాపీలను ప్రతివాదులకు అందజేశామని తెలిపారు. ఎస్‌ఈసీ తరఫున న్యా యవాది అశ్వనీకుమార్‌ను à°† బాధ్యతల నుంచి మారుస్తూ ఏప్రిల్‌ 1à°¨ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయవాది వివేక్‌ చంద్ర కలగజేసుకుని, తాను ఎస్‌ఈసీ తరఫున న్యాయవాదిగా నియమితులైనట్టు తెలిపారు. 

 

ప్రస్తుత వ్యా జ్యాల్లో ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తారన్నారు. సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్‌ 1à°¨ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ప్రస్తుత వ్యా జ్యాల్లో కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వచ్చే మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. న్యాయమూర్తి కలగజేసుకుని ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. పంచాయితీరాజ్‌ శాఖ తరఫున ప్రభుత్వ న్యా యవాది సి.సుమన్‌ స్పందిస్తూ.. à°ˆ నెల 8à°¨ పోలింగ్‌ నిర్వహించి.. 10à°¨ లెక్కింపు జరుపుతారన్నారు. దీంతో విచారణను à°ˆ నెల 6à°•à°¿(మంగళవారం) వాయిదా వేయమని కోరడంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది వీరారెడ్డి అభ్యంతరం తెలిపారు. అత్యవసర వ్యాజ్యాల్లో కౌంటర్‌ వేస్తామనే కారణం తో వాయిదా కోరడం సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చినందున పిటిషనర్లు ఎన్నికల్లో పోటీచేసే హక్కు కోల్పోతున్నారని వివరించారు. వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కలగజేసుకుని.. శనివారం నాటికి కౌంటర్‌ దాఖలు చేస్తామని.. ఆదివారం విచారణ చేపట్టాలని కోరారు.